amp pages | Sakshi

ఎన్నికలకు సన్నద్ధం 

Published on Sat, 12/16/2023 - 05:40

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని మంత్రులకు సీఎం  జగన్‌ దిశానిర్దేశం చేశారు. 2019లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ మార్చి 10న వచ్చిందని పేర్కొంటూ ఈ సారి  కాస్త ముందుగానే వెలువడే అవకాశం ఉందన్నారు. నాలుగున్నరేళ్లుగా ప్రజలతో మమేకమవుతున్నామని, 175 స్థానాల్లోనూ విజయమే లక్ష్యంగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలను సమన్వ­యం చేసుకుంటూ ఇకపై మరింత ఉద్ధృతంగా జనంలోకి వెళ్లాలని మార్గనిర్దేశం చేశారు.

శుక్రవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సీఎం జగన్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం సందర్భంగా అజెండా అంశాలపై చర్చ ముగిశాక అధికారులు ని  ్రష్క­మించారు. తర్వాత సమకాలీన రాజకీయ పరిస్థితు­లపై సీఎం జగన్‌ మంత్రులతో చర్చించారు.  నాలుగున్నరేళ్లుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో  సాకారమైన విప్లవాత్మక మా­ర్పులను ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించాలన్నారు.  

వరుస కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి.. 
ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఈనెల 21 నుంచి ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు సమన్వయం చేసుకుంటూ విస్తృతంగా పాల్గొనాలని సీఎం జగన్‌ సూచించారు. వృద్ధాప్య పింఛన్‌ రూ.2,000 వేల నుంచి రూ.3 వేలకు పెంచుకుంటూ పోతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. జనవరి 1 నుంచి రూ.3 వేలకు పెంచి పంపిణీ చేసే కార్యక్రమాన్ని జనవరి 8 వరకూ నిర్వహిస్తామని, అందులో విస్తృతంగా పాల్గొనాలని సూచించారు.

జనవరి 10 నుంచి 23 వరకూ  వైఎస్సార్‌ ఆసరా నాలుగో విడత కింద మహిళా సంఘాలకు నిధుల జమ కార్యక్రమంతో పాటు వైఎస్సార్‌ చేయూత పథకం కింద మహిళల ఖాతాల్లో నిధుల  జమ  కార్యక్రమాన్ని జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10 వరకూ నిర్వహిస్తున్నామని, అందులో విస్తృతంగా పాల్గొనాలని ఆదేశించారు. నాలుగున్నరేళ్లుగా మనం చేసిన మంచిని ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తూ, ఎల్లో మీడియాతో కలిసి టీడీపీ, జనసేన చేస్తున్న దు్రష్ఫచారాన్ని  సమర్థంగా తిప్పికొట్టాలని మార్గనిర్దేశం చేశారు. 

Videos

సీఎం జగన్ సింహగర్జన.. దద్దరిల్లిన మంగళగిరి సభ

నారా లోకేష్ కు ఈ దెబ్బతో..!

మన ప్రభుత్వం ఉంటే..మరెన్నో సంక్షేమ పథకాలు

BRS ఓటమిపై కేసీఆర్ మనసులో మాట

కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజ్ తప్పు మాది కాదు: కేసీఆర్

ఫోన్ ట్యాంపరింగ్ పై కేసీఆర్ కీ కామెంట్స్

మోదీ గెలుస్తే పెట్రోల్, డీజిల్ ధరలు..400 +..!?

శ్రీసిటీ.. ఇది సిరుల సిటీ: రవి సన్నా రెడ్డి

సీఎం జగన్ కాన్వాయ్ విజువల్స్

హిందూపూర్ లో నా మెజారిటీ ఎంతంటే..?

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)