amp pages | Sakshi

శాటిలైట్‌ సిటీలుగా వైఎస్సార్‌ జగనన్న నగరాలు

Published on Mon, 11/14/2022 - 04:09

సాక్షి, అమరావతి: పట్టణ పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ టౌన్‌షిప్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న టిడ్కో గృహాలు కొత్త పట్టణాలను తలపిస్తున్నాయి. నగరాలు, పట్టణాలకు సమీపంలోని అనువైన ప్రాంతాల్లో జీ+3 విధానంలో నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్లు అన్ని వసతులతో అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్రంలోని 88 యూఎల్బీలలో పేదల కోసం 2,62,212 ఇళ్లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 163 ప్రాంతాల్లో ఉన్న వీటికి ‘వైఎస్సార్‌ జగనన్న నగరాలు’గా నామకరణం చేశారు. ప్రాంతాన్ని బట్టి ఒక్కోచోట వెయ్యి నుంచి 12 వేల వరకు ఉన్న ఈ ఇళ్లు శాటిలైట్‌ సిటీలుగా మారబోతున్నాయి. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లోని టిడ్కో ఇళ్లలో 40 వేలకు పైగా యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 

అన్ని వసతులతో ఆధునిక ఇళ్లు
చక్కటి రోడ్లు, తాగునీరు, మురుగు కాలువలు, ఇళ్లకు విద్యుత్‌ సౌకర్యం, ఎస్టీపీలు వంటి సకల వసతులతో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తుండటం గమనార్హం. ప్రాంతాన్ని బట్టి ఈ గ్రూప్‌ హౌస్‌లు వెయ్యి నుంచి 12 వేల వరకు ఉన్నాయి. గుడివాడ, నంద్యాల, కర్నూలు, నెల్లూరు యూఎల్బీల పరిధిలో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లు 10 వేల నుంచి 12 వేల వరకు ఉండటం విశేషం. ఒక్క నెల్లూరు పరిధిలోనే (అల్లిపురం, వెంకటేశ్వరపురం) రెండుచోట్ల మొత్తం 27 వేల ఇళ్లు నిర్మిస్తున్నారంటే అవి ఎంత పెద్ద స్థాయిలో ఉన్నాయో అంచనా వేయవచ్చు.

త్వరలో ఈ ప్రాంతాలు శాటిలైట్‌ సిటీలుగా మార్చేందుకు కసరత్తు జరుగుతోంది. కాగా, గత నెలలో కొందరు యజమానులు వారికి కేటాయించి ఇళ్లలో చేరగా, వచ్చే నెలలో మంచి ముహూర్తాలు ఉండటంతో మిగిలినవారు చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వచ్చే మార్చి నాటికి మొత్తం 2.62 లక్షల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేసే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు.

ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా వంటి అవసరాలను తీర్చేందుకు అవసరమైన సిబ్బంది నియామకం, సరఫరా వంటి పనుల కోసం మునిసిపాలిటీల్లోని ఆయా శాఖల అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎస్టీపీల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గేటెడ్‌ కమ్యూనిటీలను తలపిస్తున్న ఈ 163 ప్రాంతాల్లోని ఇళ్ల అంతర్గత నిర్వహణకు నివాసితులతో సంక్షేమ సంఘాలను సైతం ఏర్పాటు చేస్తుండటం గమనార్హం.

ఇక నగరాల పరిధి దాటి పంచాయతీల్లో మరో 38 చోట్ల టిడ్కో ఇళ్లు నిర్మించగా, వాటి అవసరాలను తీర్చేందుకు మునిసిపల్‌ శాఖ పంచాయతీ విభాగంతో సంప్రదింపులు చేపట్టింది. ఇవన్నీ కొద్దిరోజుల్లో కొలిక్కి రావడంతో పాటు ఆయా కొత్త టిడ్కో పట్టణాల అవసరాలను తీర్చేందుకు మార్గం సుగమం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.  

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)