amp pages | Sakshi

కేవీకే రైతును వరించిన రాష్ట్రస్థాయి ఉగాది పురస్కారం

Published on Wed, 03/22/2023 - 23:56

కడప అగ్రికల్చర్‌ : కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం అభ్యుదయ రైతు లోమడ సదాశివరెడ్డికి గుంటూరు ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు 2023 సంవత్సరానికి ఉత్తమ రైతు పురస్కారం అందజేశారు.

వ్యవసాయంలో ఆయన అవలంబించిన వినూత్న పద్ధతులకు రాయలసీమ ప్రాంతం తరపున ఉత్తమ రైతుగా ఈయనను ఎంపిక చేశారు. ఈమేరకు బుధవారం ఆయనకు ప్రశంసాపత్రం, జ్ఞాపిక, శాలువాతోపాటు రూ. 5 వేల నగదు అందజేసి సత్కరించారు. చాపాడు మండలం వి.రాజుపాలెం గ్రామానికి చెందిన లోమడ సదాశివారెడ్డి తన 14వ ఏట నుంచే తండ్రితో కలిసి వ్యవసాయాన్ని ప్రారంభించారు. 7వ తరగతి వరకు చదువుకున్న ఈయన తనకున్న 5 ఎకరాల్లో వేరుశనగ, మినుము వంటి వ్యవసాయ పంటలతోపాటు దోస వంటి ఉద్యాన పంటలను కొత్త కొత్త వంగడాలతో అధిక దిగుబడులు లక్ష్యంగా సాగు చేస్తున్నారు.

● 1992 నుంచి కడప వ్యవసాయ పరిశోధన కేంద్రం సహకారంతో శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తూ తాను పండించిన విత్తనాలను నేరుగా ప్రభుత్వానికే విక్రయిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

● 2017 సంవత్సరం నుంచి తిరుపతి ప్రాంత్రీయ వ్యవసాయ పరిశోధనస్థానం, కడప కృషి విజ్ఞానకేంద్రం సహాయంతో టీబీజీ–104 రకం మినుము, టీసీజీయస్‌ 1694 వంటి వేరుశనగ పంటలను పండిస్తున్నారు. ఏటా 150 క్వింటాళ్ల దిగుబడులను తీసి 30 క్వింటాళ్ల చొప్పున గుంటూరు ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సరఫరా చేస్తున్నారు. అలగే ఇక్కడి ప్రాంత రైతులకు విక్రయిస్తున్నారు.

● తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతోపాటు మన రాష్ట్రంలోని శ్రీకాకుళం, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, తిరుపతి, నెల్లూరు ప్రాంతాలకు చెందిన రైతులు నేరుగా సదాశివారెడ్డి వద్దకు వచ్చి విత్తనాలను తీసుకుని వెళుతుంటారు.

● అంతేకాకుండా జీవన ఎరువులు, ప్రకృతి వ్యవసాయం, సమగ్ర చీడపీడల యాజమాన్య పద్ధతులను, విధానాలను పాటిస్తూ అధిక దిగుబడులు ఆదాయం పొందుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పురస్కారం పొందిన రైతు లోమడ సదాశివారెడ్డిని కేవీకే కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ వీరయ్య, కేవీకే శాస్త్రవేత్తలు అభినందించారు.

రూ.5 వేల నగదుతోపాటు

ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేత

అభినందించిన కేవీకే కోఆర్డినేటర్‌, శాస్త్రవేత్తలు

Videos

నరసాపురం జనసంద్రం

రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్

చంద్రబాబుపై ఫైర్

పవన్ కళ్యాణ్ ఊగిపోయే స్పీచ్ కి పిఠాపురం శేషు కుమార్ స్ట్రాంగ్ కౌంటర్

ఏపీలో వైఎస్ఆర్ సీపీకి మద్దతు ప్రకటించిన ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్

నా కొడుకు కోసం బందరులో ఎక్కడైనా అడుగు.. ఒక్కటే సమాధానం

మంగళగిరిలో నారా లోకేష్ మొహం చూపించుకోలేకపోతున్నాడు..!

పవన్ కళ్యాణ్ ని వంగా గీత ఒక్క మాట కూడా అనలేదు.. అది ఆమె సంస్కారం..!

Watch Live: నరసాపురంలో సీఎం జగన్ ప్రచార సభ

సీదిరి అప్పలరాజు స్పెషల్ ఇంటర్వ్యూ

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట

చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదు

పిరియా విజయ పల్లె నిద్ర

ఈసీ షాక్..కుదేలైన కూటమి..

అవ్వా, తాతల ఉసురు పోసుకుని ఉరేగుతోన్న పచ్చమంద

ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత..

వైఎస్ భారతి రెడ్డి ఎన్నికల ప్రచారం

ఏపీలో మోదీ ఎన్నికల ప్రచారం

ప్రణాళికా బద్ధంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి..

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)