amp pages | Sakshi

Weekly Horoscope: ఈ రాశివారికి వారంలో పట్టిందల్లా బంగారమే

Published on Sun, 11/27/2022 - 06:40

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగం కలిగే సూచనలు. సమయానికి రావలసిన బాకీలు సైతం అందుతాయి. వ్యాపారాలలో ఊహించని  పెట్టుబడులు అందుతాయి. ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో విధుల్లో మార్పులు ఉపకరిస్తాయి. పారిశ్రామికవర్గాల అంచనాలు నిజం కాగలవు. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకుంటారు. రుణదాతల ఒత్తిడులు తీరతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. భాగస్వాములతో చర్చలు సఫలం.  ఉద్యోగాలలో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. విధుల్లో అవరోధాలు తొలగుతాయి. వారం ప్రారంభంలో అనుకోని వ్యయం. పసుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

మిథునం (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
విద్యార్థులకు శ్రమ ఫలిస్తుంది. అవసరాలకు తగినంత సొమ్ము అందుతుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. శుభకార్యాల నిర్వహణపై కుటుంబసభ్యులతో చర్చిస్తారు. వ్యాపారాలలో మీ అంచనాల మేరకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి. రాజకీయవేత్తలు కొంత నిరాశ చెందినా క్రమేపీ పరిస్థితులు అనుకూలిస్తాయి. వారం మధ్యలో మానసిక అశాంతి. బంధువులతో కొన్ని సమస్యలు. పసుపు, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.  

కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలులో కొంత జాప్యం. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తీరతాయి. వ్యాపారాలలో కొత్త అంచనాలతో ముందుకు సాగి లాభాలు ఆర్జిస్తారు.  ఉద్యోగాలలో ఊహించని విధంగా మార్పులు రావచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అనుకూలస్థితి. వారం చివరిలో వృథా ఖర్చులు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. 

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
యత్నకార్యసిద్ధి. ఆస్తి వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. దైవకార్యాలలో పాల్గొంటారు. వాహనసౌఖ్యం. ఆశించిన విధంగా డబ్బు చేతికందుతుంది. ఆరోగ్యం మరింత మెరుగుదల కనిపిస్తుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరి ఉత్సాహంగా అడుగువేస్తారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలు అత్యంత నేర్పుగా వ్యవహారాలు చక్కదిద్దుతారు. వారం చివరిలో ధనవ్యయం. మానసిక ఆందోళన.  గులాబీ, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొన్ని పనులలో  విజయం సాధిస్తారు. విద్యార్థులు సత్తా చాటుకుని ముందడుగు వేస్తారు. క్రీడాకారులకు ఊహించని గౌరవం. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు తీరతాయి. వ్యాపారాలలో లాభాలు రాగలవు. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు తగినంత ప్రోత్సాహం అందుతుంది. వారం ప్రారంభంలో కుటుంబంలో కొన్ని ఇబ్బందులు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. నూతన ఒప్పందాల ద్వారా కొంత సొమ్ము సమకూరుతుంది. ఆస్తుల విషయంలో చర్చలు సఫలం. వ్యాపారాలలో అనుకున్న విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఉద్యోగ విధుల్లో అవాంతరాలను అధిగమిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులకు యత్నాలు కలిసివస్తాయి. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. నీలం, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృశ్చికం (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తప్పవు. ఆస్తుల సమస్యలు  జటిలం కాగల సూచనలు. ప్రతి నిర్ణయంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యాపారాలలో  లాభాలు కనిపించవు. పెట్టుబడుల్లో తొందరపాటు వద్దు. ఉద్యోగాలలో  ఊహించని మార్పులు జరిగే అవకాశం. పారిశ్రామికవేత్తలకు గందరగోళ పరిస్థితి. వారం మధ్యలో శుభవార్తలు. తెలుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. 

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆస్తులు కొనుగోలు చేస్తారు. అదనపు ఆదాయం సమకూరుతుంది.  మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న విధంగా లాభాలు అందుకుంటారు. పెట్టుబడులు మరిన్ని రాగలవు.  ఉద్యోగాలలో విధులు సక్రమంగా నిర్వర్తిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులకు శ్రమ కొంత ఫలించే సమయం. వారం చివరిలో మధ్యలో మానసిక అశాంతి. వ్యయప్రయాసలు. ఎరుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఆస్తి విషయాలలో  అగ్రిమెంట్లు చేసుకుంటారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. గృహం, వాహనాలు కొంటారు. వ్యాపారాలలో విస్తరణ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూల సమయం. వారం ప్రారంభంలో దుబారా ఖర్చులు. ఆకుపచ్చ, నీలం రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి. 

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కాంట్రాక్టర్లకు కలసివచ్చేకాలం. వాహనాలు, స్థలాలు కొనుగోలు యత్నాలు సాగిస్తారు. ఆశించిన సొమ్ము సమకూరి అవసరాలు తీరతాయి. వేడుకల నిర్వహణపై  నిర్ణయానికి వస్తారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుని లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళారంగం వారికి అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వారం చివరిలో వృథా ఖర్చులు. తెలుపు, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

మీనం (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
వాహనయోగం. నిరుద్యోగులకు ఊరట. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అప్పుల బాధలు సైతం తీరే సమయం. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో కోరుకున్న రీతిలో బాధ్యతలు రాగలవు.  పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొంత అనుకూల సమయమే. వారం మధ్యలో వ్యయప్రయాసలు. పసుపు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణస్తోత్రాలు పఠించండి. 

- సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్