amp pages | Sakshi

మా ఉద్యోగాలు పోయినా ఫర్వాలేదు.. మాకు రోబోలే కావాలి

Published on Mon, 11/15/2021 - 21:29

రోజురోజుకీ టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది. దీంతో మనిషి చేయలేని ఎన్నో పనుల్ని ఆ మనిషే రోబోట్‌లతో చేయిస్తున్నాడు. అందుకే రాబోయే రోజుల్లో మనుషుల కంటే రోబోట్‌ల పాత్ర ఎక్కువగా ఉండాలని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఒరాకిల్‌ సంస్థ జూలై 27 నుంచి ఆగస్టు 17 మధ్యకాలంలో యూఎస్‌, యూకే, యూఏఈ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, జర్మనీ, బ్రెజిల్, ఇండియా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, ఆస్ట్రేలియాలో  సర్వే నిర్వహించింది. విడుదలైన ఈ సర్వే ఫలితాల్లో మనుషుల కంటే రోబోలు 82శాతం మెరుగ్గా పనిచేస్తాయనే అభిప్రాయం వ్యక్తమైంది. అంతేకాదు ఉద్యోగాలు కోల్పోయినా ఫర్వాలేదు..ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ వల్ల భవిష్యత్‌ను అంచనా వేయొచ్చని అంటున్నారు.    

'ఏఐ@వర్క్: 2021 గ్లోబల్ స్టడీ'
కొద్ది రోజుల క్రితం ఒరాకిల్‌ సంస్థ 'ఏఐ@వర్క్: 2021 గ్లోబల్ స్టడీ' పేరుతో ఓ సర్వేని నిర్వహించింది. కరోనా మహమ్మారి కారణంగా వర్క్‌ప్లేస్‌లో టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందనే అంశంపై సర్వే చేపట్టింది. ఈ సర్వేలో మనుషుల కంటే రోబోలు మెరుగ్గా పనిచేయగలవా అన్న ప్రశ్నకు సమాధానంగా పలు టెక్‌ నిపుణులు ఆసక్తికరమైన అభిప్రాయాల్ని వెల్లడించారు. మనుషుల కంటే రోబోట్‌లో 82 శాతం  తమ కెరీర్‌కు మనుషుల కంటే మెరుగ్గా మద్దతిస్తాయని అంటున్నారు. వాస్తవానికి, 85 శాతం మంది భవిష్యత్తును అంచనా వేసేందుకు టెక్నాలజీని కోరుకుంటున్నట్లు తెలిపారు. 

కరోనా మార్చింది. 
కరోనా కారణంగా 80 శాతం మంది ఉద్యోగులు ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. గతేడాది కరోనా వల్ల ఆరోగ్య, ఆర్ధిక సమస్యలు తలెత్తినట్లు ఈ సర్వేలో  పాల్గొన్న ఉద్యోగులు తెలిపారు. 83 శాతం మంది కెరీర్‌లో మార్పు కోరుకుంటున్నారని, 93 శాతం మంది తమ వ్యక్తిగత జీవితంలో మార్పులు జరగాలని కోరుకుంటున్నట్లు నివేదిక పేర్కొంది. ఇక 76 శాతం మంది ఉద్యోగులు ఒక రంగం నుంచి మరో రంగానికి మారడానికి ఆర్థిక కష్టాలు అడ్డంకిగా ఉన్నట్లు, 75 శాతం మంది తమ వృత్తి జీవితంలో , 76 శాతం మంది తమ వ్యక్తిగత జీవితం వల్ల కెరీర్‌ను మార్చుకోలేకపోతున్నట్లు భావిస్తున్నారు.  88 శాతం మంది పని, జీవిత సమతుల్యత, మానసిక ఆరోగ్యం,ఫ్లెక్సిబిలిటీ ప్రధాన ప్రాధాన్యతలతో విజయం యొక్క అర్థం మారిపోయిందని చెప్పారు.

యజమాని తీరుపై అసంతృప్తి 
ఇక ఈ సర్వేలో అనూహ్యంగా 85 శాతం మంది ఉద్యోగులు మెరుగైన కెరియర్‌ విషయంలో తమ సంస్థలు సపోర్ట్‌ చేయడం లేదని తెలిపారు. 87 శాతం మంది తమ కంపెనీలు తమ అవసరాలకు తగ్గట్లు పనితీరు మార్చాలని కోరుకుంటున్నారు.

చదవండి: ‘అత్తారింటికి దారేది’లో పరిస్థితే వస్తే.. ఈ కారే చూసుకుంటుంది

#

Tags

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)