amp pages | Sakshi

ఎయిర్‌టెల్‌ యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌...!

Published on Wed, 02/09/2022 - 17:08

గతేడాది చివర్లో దేశీయ దిగ్గజ టెలికాం సంస్థలు టారిఫ్‌ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సుమారు 20 శాతం మేర టారిఫ్‌ ధరలను దిగ్గజ టెలికాం కంపెనీలు పెంచాయి. కాగా ఈ ఏడాదిలో ఎయిర్‌ టెల్‌ టారిఫ్‌ ధరలను మరోమారు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

కలిసొచ్చిన టారిఫ్‌ ధరల పెంపు..!
మొబైల్‌ టారిఫ్‌ ధరల పెంపుతో భారతీ ఎయిర్‌టెల్‌కు మూడో త్రైమాసికంలో కాస్త కలిసొచ్చింది. వీటితో పాటు కంపెనీలో గూగుల్‌ పెట్టుబడులు ఉపశమనం కల్గించాయని కంపెనీ పేర్కొంది. ఎయిర్‌టెల్ డిసెంబర్ త్రైమాసికంలో నికర లాభం రూ. 854 కోట్ల నుంచి రూ. 830 కోట్లకు 3 శాతం పడిపోయిందని నివేదించింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం సంవత్సరానికి 13 శాతం పెరిగింది. ఈ త్రైమాసికంలో ఏఆర్‌పీయూ రూ.163కు  మెరుగుపడింది. అయితే మరో మూడు లేదా నాలుగు నెలల్లో కాకపోయినా, ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలోనే మరో మారు  టారిఫ్ పెంపు ఉండవచ్చునని  ఎయిర్‌టెల్ టాప్ మేనేజ్‌మెంట్ అభిప్రాయపడ్డారు. 2022లో నెలకు ARPU (ఒక వినియోగదారుడి సగటు రాబడి)ని రూ. 200 తీసుకోవాలని కంపెనీ భావిస్తోందని మేనేజ్‌మెంట్ పేర్కొంది. దీంతో టారిఫ్‌ పెంపు మరోమారు ఉండే అవకాశం ఉన్నట్లు కన్పిస్తోంది. 

బోర్డు ఆమోదం..!
డెట్ సెక్యూరిటీలు, బాండ్లు మొదలైన వాటి జారీ ద్వారా రుణ సాధనాల్లో రూ. 7,500 కోట్ల వరకు సేకరించేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. కంపెనీ పోస్ట్ ఎర్నింగ్స్ కాల్ సందర్భంగా, ఎయిర్‌టెల్ టారిఫ్ పెంపు ప్రారంభ సంకేతాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని , కొత్త ఉత్పత్తులను వేగవంతం చేయడంపై కంపెనీ తన దృష్టిని కొనసాగిస్తుందని బోర్డు మీటింగ్‌లో తెలిపింది.

చదవండి: కిలోమీటర్‌కు కేవలం 14 పైసల ఖర్చు..! తక్కువ ధరలో మరో ఎలక్ట్రిక్‌ బైక్‌..!

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)