amp pages | Sakshi

బుర్జ్ ఖలీఫాను మించి.. నిర్మాణ సామగ్రి ఉత్పత్తి గురించి ఆసక్తికర విషయాలు!

Published on Thu, 10/19/2023 - 10:52

నిర్మాణ రంగం రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచంలో ఎన్నెన్నో అద్భుతమైన భవనాలు ఈ రోజుకీ పురుడుపోసుకుంటున్నాయి. ఇలాంటి భవనాలు లేదా నగరాల నిర్మాణానికి కావాల్సిన ప్రధానమైన ముడిపదార్ధాలు సిమెంట్, ఉక్కు (స్టీల్), ఇసుక. 2020లో ప్రపంచంలో ఈ ముడిపదార్ధాల ఉత్పత్తి ఎంత? ఏ దేశంలో ఎక్కువ ఉత్పత్తి ఉంది.. వంటి ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

సిమెంట్
అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం, 2020లో అత్యధికంగా సిమెంట్ ఉత్పత్తి చేసిన దేశాల జాబితాలో చైనా (2200 మిలియన్ టన్నులు) అగ్ర స్థానంలో, రెండవ స్థానంలో భారత్ (340 మిలియన్ టన్నులు) నిలిచాయి. చివరి స్థానంలో సౌత్ కొరియా మొదలైన దేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం సిమెంట్ ఉత్పత్తి 2020లో 4.1 బిలియన్ టన్నులు.

ప్రపంచలోని అన్ని దేశాలు ఉత్పత్తి చేసిన సిమెంటుతో ఒక దిమ్మె నిర్మిస్తే.. అది 1,195 మీటర్ల పొడవు, 1.7 బిలియన్ క్యూబిక్ మీటర్ల పరిమాణం ఉంటుంది. బరువు ఏకంగా 4.1 బిలియన్ టన్నులు ఉంటుంది. ఈ దిమ్మె పొడవు బుర్జ్ ఖలీఫా కంటే 365 మీటర్లు ఎక్కువ ఉంటుందన్నమాట.

సిమెంట్ తయారు చేసేటప్పుడు టన్నుల కొద్దీ కార్బన్ డయాక్సైడ్ (CO2) విడుదలవుతుంది, అధిక మొత్తంలో నీరు అవసరమవుతుంది. కాంక్రీట్ ఉత్పత్తిలో అధిక కార్బన్ ఉద్గారాలు, నీటి వినియోగాన్ని తగ్గించేందుకు, స్వీడిష్ పవర్ కంపెనీ వాటెన్‌ఫాల్ ఓ ప్రత్యేకమైన కాంక్రీట్ మిశ్రమాన్ని అభివృద్ధి చేసింది. దీని ద్వారా CO2 ఉద్గారాలు బాగా తగ్గుతాయి.

ఉక్కు (స్టీల్)
సిమెంట్ తరువాత నిర్మాణానికి కావాల్సిన ముఖ్యమైన లోహం ఉక్కు. 2020లో ప్రపంచంలోని అన్ని దేశాలు కలిపి మొత్తం 180 కోట్ల టన్నుల బరువైన ఉక్కుని ఉత్పత్తి చేశాయి. అంతకు ముందు 1900 నుంచి ఉక్కు పరిశ్రమ 2500 కోట్ల టన్నుల స్టీల్ స్క్రాప్‌ను రీసైకిల్ చేసింది. దీని వల్ల 3500 కోట్ల టన్నుల ఇనుము వినియోగం, 1800 కోట్ల టన్నుల బొగ్గు వినియోగం తగ్గింది.

ప్రపంచ దేశాల్లో ఉత్పత్తి అయిన ఉక్కుతో ఓ దిమ్మె నిర్మిస్తే.. అది 610 మీటర్ల ఎత్తు, 227.8 మిలియన్స్ ఘనపు మీటర్ల పరిమాణం, 180 కోట్ల టన్నుల బరువుతో నిర్మితమవుతుంది.

ఇదీ చదవండి: గంటకు 23 మంది.. ఏడాదికి వేలల్లో.. ఆందోళనలో టెకీలు!

రంగాల వారీగా రికవరీ రేట్లు

ఇసుక
నిర్మాణ రంగంలో మరో ముఖ్యమైన మెటీరియల్ ఇసుక, కంకర (చిన్న రాళ్లు). 2020లో ఉత్పత్తి అయిన ఇసుక 26.5 కోట్ల టన్నులు. ఇంత ఇసుకతో ఏకంగా 555 మీటర్ల ఎత్తు, 171 మిలియన్ క్యూబిక్ మీటర్ల పరిమాణంతో ఓ దిమ్మె నిర్మించవచ్చు. ప్రస్తుతం చాలా నగరాల్లో ఇసుక అవసరం లేకుండానే పెద్ద పెద్ద భవనాలను గాజు, ఇతర మెటీరియల్స్ ఉపయోగించి ఎంతో అందంగా నిర్మిస్తున్నారు.

Videos

టీడీపీ సర్పంచ్ కి 11 లక్షల సంక్షేమ పథకాలు...అది సీఎం జగన్ సంస్కారం..

విశాఖపై టీడీపీ కొత్తరాగం

పేదలపై చంద్రబాబు పెత్తందారీ కుట్ర

సముద్రంలో చేపలు పట్టిన KA పాల్

నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి లు చెప్పేవి అన్ని అబద్ధాలే..

బాచుపల్లిలో ఘోర ప్రమాదం

మేము ఎప్పుడో గెలిచాం..మెజారిటీ కోసం చూస్తున్నాం..

నల్లజర్ల ఘటనపై మంత్రి తానేటి వనిత రియాక్షన్

సర్వే పై సంచలన విషయాలు బయటపెట్టిన కెఎస్ ప్రసాద్..

బూతు అస్త్రం ప్రయోగిస్తున్న బాబు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?