amp pages | Sakshi

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం డాబర్‌ చైర్మన్‌గా వైదొలిగిన అమిత్‌ బర్మన్‌

Published on Fri, 08/12/2022 - 12:44

సాక్షి, ముంబై: ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్  దిగ్గజం డాబర్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ పదవికి అమిత్ బర్మన్ రాజీనామా చేశారు. నాన్-ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్‌గా  ఉన్న మోహిత్ బర్మన్‌ను  5 సంవత్సరాల కాలానికి బోర్డు నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో పాటు బోర్డు నాన్-ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్‌గా సాకేత్ బర్మన్‌ను నియమిస్తున్నట్లు  చెప్పింది. అయితే బర్మన్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతారని  శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. 

డాబర్ ఛైర్మన్ అమిత్ బర్మన్ తన బాధ్యతల నుండి వైదొలిగినట్లు కంపెనీ  బీఎస్‌ఈ ఫైలింగ్ ద్వారా తెలిపింది. ఆగష్టు 10 నుంచే ఆయన రాజీనామా అమలులోకి వచ్చిందని, దీన్ని డైరెక్టర్ల బోర్డు ఆమోదించిందని ప్రకటించింది. అమిత్‌ బర్మన్‌ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కంపెనీకి సేవలను కొనసాగిస్తారని  తెలిపింది.   (ఫెస్టివ్‌ సీజన్‌: పలు కంపెనీల కార్లపై డిస్కౌంట్ బొనాంజా)

1999లో డాబర్ ఫుడ్స్  బాధ్యతలు స్వీకరించిన అమిత్‌  అనేక రకాల పొడులు, చట్నీలు ప్యాకేజ్డ్ ఫుడ్ జ్యూస్‌లతో ఫుడ్స్ వ్యాపారాన్ని పరిచయం చేశారు. అయితే  2007లో డాబర్ ఇండియాలో కంపెనీ విలీనం కావడంతో ఆయన డాబర్ ఫుడ్స్ సీఈవో పదవి నుంచి వైదొలిగారు. ఆ తర్వాత డాబర్ ఇండియా లిమిటెడ్ వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు. (సంచలన నిర్ణయం: ఐకానిక్‌ బేబీ పౌడర్‌కు గుడ్‌బై)

2019లో డాబర్ ఇండియా చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ, కొలంబియా విశ్వవిద్యాలయంలో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో ఎంఎస్సీ చేశారు. డాబర్‌లో చేరడానికి ముందు, మాన్యుఫ్యాక్చరింగ్ స్ట్రాటజీ విభాగంలో కోల్‌గేట్ పామోలివ్‌తో కలిసి పనిచేశారు. 1990లో అతను టిష్కాన్ కార్పొరేషన్ న్యూయార్క్‌లో కూడా శిక్షణ పొందారు అమిత్‌.

Videos

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్

ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్

అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..

నరసాపురం జనసంద్రం

రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్

చంద్రబాబుపై ఫైర్

పవన్ కళ్యాణ్ ఊగిపోయే స్పీచ్ కి పిఠాపురం శేషు కుమార్ స్ట్రాంగ్ కౌంటర్

ఏపీలో వైఎస్ఆర్ సీపీకి మద్దతు ప్రకటించిన ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్

నా కొడుకు కోసం బందరులో ఎక్కడైనా అడుగు.. ఒక్కటే సమాధానం

మంగళగిరిలో నారా లోకేష్ మొహం చూపించుకోలేకపోతున్నాడు..!

పవన్ కళ్యాణ్ ని వంగా గీత ఒక్క మాట కూడా అనలేదు.. అది ఆమె సంస్కారం..!

Watch Live: నరసాపురంలో సీఎం జగన్ ప్రచార సభ

సీదిరి అప్పలరాజు స్పెషల్ ఇంటర్వ్యూ

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట

చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదు

పిరియా విజయ పల్లె నిద్ర

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)