amp pages | Sakshi

ఈక్విటీలకు దేశీ ఇన్వెస్టర్ల మద్దతు

Published on Fri, 06/10/2022 - 05:46

న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్లకు దేశీ నిధుల మద్దతు దండిగా ఉంది. ఇందుకు నిదర్శనంగా మే నెలలోనూ ఈక్విటీ ఫండ్స్‌ రూ.18,529 కోట్ల మేర నికర పెట్టుబడులను ఆకర్షించాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో వచ్చిన రూ.15,890 కోట్ల కంటే మరింత అధికంగా వచ్చాయి. మే నెలకు సంబంధించి మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల గణాంకాలను మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ (యాంఫి) విడుదల చేసింది. 2021 మార్చి నెల నుంచి ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ప్రతి నెలా నికరంగా పెట్టుబడులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. అంతకుముందు వరుసగా ఎనిమిది నెలల కాలంలో నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లాయి.  

అన్ని విభాగాల్లోకి..
► మే నెలలో ఈక్విటీలోని అన్ని విభాగాల్లోకి పెట్టుబడులు ప్రవహించాయి. ఫ్లెక్సీ క్యాప్‌ విభాగంలోకి అత్యధికంగా రూ.2,939 కోట్లు వచ్చాయి.  
► లార్జ్‌క్యాప్, లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్, సెక్టోరల్‌ ఫండ్స్‌లోకి రూ.2,200 కోట్లు, అంతకుమించి పెట్టుబడులు వచ్చాయి.
► ఇండెక్స్‌ ఫండ్స్, ఇతర ఈటీఎఫ్‌లు రూ.11,779 కోట్ల పెట్టుబడులను రాబట్టాయి.
► గోల్డ్‌ ఈటీఎఫ్‌లు రూ.203 కోట్లను ఆకర్షించాయి.  
► డెట్‌ విభాగం నుంచి నికరంగా రూ.32,722 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. అంతకుముందు నెల ఏప్రిల్‌లో రూ.69,883 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం.
► అన్ని విభాగాలు కలిపితే ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి రూ.7,532 కోట్లను నికరంగా వెనక్కి తీసేసుకున్నారు. ఏప్రిల్‌లో నికర పెట్టుబడుల రాక రూ.72,846 కోట్లుగా ఉంది.
► మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల నిర్వహణలోని మొత్తం ఆస్తులు (ఏయూఎం) ఏప్రిల్‌ చివరికి ఉన్న రూ.38.89 లక్షల కోట్ల నుంచి మే చివరికి రూ.37.37 లక్షల కోట్లకు క్షీణించింది.


సిప్‌ కళ..: సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో వచ్చిన పెట్టుబడులు ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.11,863 కోట్లు కాగా>, మే నెలలో రూ.12,286 కోట్లకు పెరిగాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు అనిశ్చితుల్లోనూ ఈక్విటీల పట్ల నమ్మకాన్ని చూపిస్తున్నారని చెప్పడానికి ఈ గణాంకాలు నిదర్శనంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. నెలవారీ సిప్‌ పెట్టుబడులు రూ.10వేల కోట్లకు పైన రావడం వరుసగా ఇది తొమ్మిదో నెల కావడాన్ని గమనించాలి.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)