amp pages | Sakshi

ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతాయి..  

Published on Sat, 09/24/2022 - 18:11

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇతర వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే భారత మార్కెట్లు మెరుగైన పనితీరే కనబరుస్తున్నా యని పీజీఐఎం ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ హెడ్‌ (ఈక్విటీస్‌) అనిరుద్ధ నాహా తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) విక్రయాలను కొనసాగిస్తారని, నిధులను ఇతర మార్కెట్లలోకి తిప్పుతుంటారని ఆయన పేర్కొన్నారు. గత తొమ్మిది నెలలుగా ఎఫ్‌ఐఐలు విక్రయించడం, దేశీ సంస్థలు  కొనుగోళ్లు జరుపుతుండటం కొనసాగుతోందని నాహా చెప్పారు. భారీ అమ్మకాలు వెల్లువెత్తుతున్నా, మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతు న్నప్పటికీ దేశీ ఇన్వెస్టర్లు పరిణితితో వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

దేశీ మదుపుదారుల పెట్టుబడులు కొనసాగుతుండటంతో ఎఫ్‌ఐఐల అమ్మకాల ఒత్తిడిని తట్టుకుని మార్కెట్లు నిలబడు తున్నాయన్నారు. మార్కెట్లు మరికొంత కరెక్షన్‌కి లోనుకావచ్చని, అయితే ఈక్విటీలకు కేటాయింపులు జరిపేందుకు.. దీర్ఘకాలంలో సంపద సృష్టించుకునేందుకు ఇది సరైన సమయమని నాహా చెప్పారు. భారతీయులు సాధారణంగా ఈక్విటీలు, ఈక్విటీ ఫండ్‌లకు ఎక్కువగా కేటాయించరని, ప్రస్తుతం ఆ ధోరణి మారుతోందని తెలిపారు.  

మరోవైపు, రిస్కులను సమర్ధంగా ఎదుర్కొంటూ మెరుగైన రాబడులు పొందేందుకు, ట్యాక్సేషన్‌పరంగా ప్రయోజనకరంగా ఉండేందుకు బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్స్‌ (బీఏఎఫ్‌) ఆకర్షణీయంగా ఉంటున్నాయని నాహా పేర్కొన్నారు. దీనికి అనుగుణంగానే పీజీఐఎం ఇండియా బీఏఎఫ్‌ను నిర్వహిస్తున్నామని వివరించారు. మార్కెట్‌ వేల్యుయేషన్స్‌ అధిక స్థాయిలో ఉన్నప్పుడు కొంత ఈక్విటీ భాగాన్ని హెడ్జ్‌ చేసి, డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తామని.. తద్వారా మార్కెట్‌ పతనమైన పెద్దగా ప్రభావం పడకుండా ఉంటుందని నాహా చెప్పారు. అలాగే తక్కువ స్థాయిలో కొనుగోలు చేసి అధిక స్థాయిలో విక్రయించే సూత్రాన్ని పాటిస్తాం కాబట్టి మెరుగైన రాబడులు అందించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.  

Videos

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌