amp pages | Sakshi

ఇక గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ ఆర్థిక సేవలు

Published on Tue, 04/12/2022 - 06:27

ముంబై: గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ (జీఐఎల్‌) సోమవారం గ్రూప్‌ ఆర్థిక సేవల విభాగం గోద్రెజ్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌ (జీసీఎల్‌)ను ప్రారంభించింది. గోద్రెజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్, గోద్రెజ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌కు హోల్డింగ్‌ సంస్థగా గోద్రెజ్‌ క్యాపిటల్‌ ఉంటుంది. తన కొత్త విభాగంలో  ఈ నెలాఖరుకు గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ రూ.1,500 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు పెట్టనుంది. 2026 నాటికి సంస్థ వ్యాపార అవసరాలకు రూ.5,000 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు అవసరం అవుతాయని భావిస్తున్నట్లు గోద్రెజ్‌ క్యాపిటల్‌ చైర్మన్‌ పిరోజ్‌షా గోద్రెజ్‌ తెలిపారు. ఆర్థిక సేవల విభాగంలో పటిష్టంగా నిలబడగలమన్న విశ్వాసం తమకు ఉందని ఆయన తెలిపారు. అందుకు తగిన పరిస్థితులు మార్కెట్‌లో ఉన్నాయని కూడా పేర్కొన్నారు. ఈ అంశమే తమ పెట్టుబడులకు ప్రధాన కారణమని వివరించారు.

అవకాశంగా భావిస్తున్నాం...
ఆర్థిక సేవల విభాగంలో వ్యాపార విస్తరణను తాము గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు పిరోజ్‌షా గోద్రెజ్‌  తెలిపారు. ‘‘పెట్టుబడులు అన్నీ గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ బ్యాలెన్స్‌ షీట్‌ నుండి సమకూర్చాలన్నది మా ప్రణాళిక. ఈ నెలాఖరుకు రూ.1,500 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం. 2026 నాటికి అవసరమయ్యే మిగిలిన రూ. 3,500 కోట్ల కోసం మేము గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ బోర్డు ఆమోదం పొందుతాము. ఈ మొత్తంలో అధికభాగం గ్రూప్‌ నుంచే సమకూర్చుకోవాలన్నది మా ఉద్దేశం’’అని  పిరోజ్‌షా తెలిపారు. 2026 నాటికి కంపెనీ బ్యాలెన్స్‌ షీట్‌ రూ.30,000 కోట్లకు పెంచాలన్నది లక్ష్యమని కూడా వివరించారు.  

సురక్షిత రుణాలపైనే దృష్టి...
కాగా,  రాబోయే సంవత్సరాల్లో గోద్రేజ్‌ క్యాపిటల్‌ ఒక నూతన తరం, ప్రముఖ రిటైల్‌ ఆర్థిక సేవల సంస్థగా మారుతుందని తాము భావిస్తున్నట్లు జీసీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈఓ మనీష్‌ షా తెలిపారు. గృహ  రుణాలు, ఆస్తిపై రుణాలు (ఎల్‌ఏపీ– లోన్‌ ఎగైనెస్ట్‌ ప్రాపర్టీ)లతో కూడిన సురక్షిత రుణాల వృద్ధిపై కంపెనీ దృష్టి సారిస్తుందని తెలిపారు. సంబంధిత వర్గాల వివరాల ప్రకారం జీసీఎల్‌ ప్రస్తుతం ముంబై, బెంగళూరు, ఢిల్లీ–ఎన్‌సీఆర్, అహ్మదాబాద్, పుణేలలో కార్యకలాపాలు ప్రారంభించింది. త్వరలో హైదరాబాద్‌సహా జైపూర్, చండీగఢ్, చెన్నై, ఇండోర్, సూరత్‌లకు విస్తరిస్తుంది.  

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)