amp pages | Sakshi

వెనకడుగులో..  బంగారం- వెండి

Published on Wed, 09/09/2020 - 10:23

ముందురోజు ఒడిదొడుకుల మధ్య దేశీ ఫ్యూచర్స్‌ మార్కెట్లో బలపడిన బంగారం, వెండి ధరలు తాజాగా డీలాపడ్డాయి. నాలుగు రోజుల నష్టాల నుంచి సోమవారం బయటపడిన పసిడి ధరలు.. మంగళవారం చివర్లో పుంజుకున్నాయి. తద్వారా వరుసగా రెండు రోజులపాటు లాభపడ్డాయి. అయితే ప్రస్తుతం విదేశీ మార్కెట్లో వెనకడుగు వేయడంతో దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ బలహీనపడ్డాయి. వివరాలు ఇలా..  

నేలచూపులో
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 200 నష్టంతో రూ. 51,153 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 489 క్షీణించి రూ. 68,005 వద్ద కదులుతోంది.

రెండో రోజూ జోరు
వరుసగా రెండో రోజు మంగళవారం పసిడి, వెండి ధరలు ఊపందుకున్నాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 288 ఎగసి రూ. 51,353 వద్ద ముగిసింది. తొలుత 51,406 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 50,629 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 223 బలపడి రూ. 68,494 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 68,713 వరకూ ఎగసిన వెండి ఒక దశలో రూ. 66,155 వరకూ నీరసించింది. నాలుగు రోజుల వరుస నష్టాలకు సోమవారం చెక్‌ పడగా.. పసిడి రూ. 387 ఎగసి రూ. 51,065 వద్ద నిలిచిన సంగతి తెలిసిందే. ఈ బాటలో వెండి మరింత అధికంగా రూ. 1,005 జంప్‌చేసి రూ. 68,271 వద్ద స్థిరపడింది.

కామెక్స్‌లో వీక్
ప్రస్తుతం న్యూయార్క్‌ కామెక్స్‌లో బంగారం, వెండి ధరలు నీరసించాయి.   ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి 0.3 శాతం క్షీణించి 1,937 డాలర్లకు చేరింది. స్పాట్‌ మార్కెట్లో 0.1 శాతం తక్కువగా 1930 డాలర్ల వద్ద కదులుతోంది. వెండి సైతం ఔన్స్ 0.5 శాతం బలహీనపడి 26.85 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మంగళవారం తొలుత పసిడి, వెండి ధరలు క్షీణించినప్పటికీ చివర్లో పుంజుకోవడం గమనార్హం!

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌