amp pages | Sakshi

Work From Home: వర్క్‌ ఫ్రమ్‌ హోం ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్‌..!

Published on Tue, 12/07/2021 - 15:12

Government To Chalk Out Legal Road Map For Work From Home: వర్క్‌ ఫ్రమ్‌ హోం ఉద్యోగులకు శుభవార్త...! కరోనా రాకతో ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. కాగా ఆయా కంపెనీలు ఉద్యోగులతో ఎక్కువసేపు పనిచేస్తున్నారనే వార్తలు రావడంతో... వర్క్‌ ఫ్రమ్‌ హోంపై కేంద్రం త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనుంది. 

త్వరలోనే... ఫ్రేమ్‌ వర్క్‌..!
వర్క్‌ ప్రమ్‌ హోంపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే  ఒక ఫ్రేమ్‌ వర్క్‌ను రూపొందించేందుకు ఓ కమిటీను ఏర్పాటుచేయనుంది. దీంతో ఉద్యోగుల హక్కులను కాపాడే అవకాశం ఉంది. వర్క్‌ ఫ్రమ్‌ హోం పేరుతో ఉద్యోగులను ఆయా సంస్థలు పిండేస్తున్నాయి. ఈ ఫ్రేమ్‌ వర్క్‌తో ఉద్యోగులకు కచ్చితమైన పనిగంటలను నిర్ణయించి అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఉద్యోగులకు విద్యుల్‌, ఇంటర్నెట్‌ బిల్లులు, ఇంట్లో ఉపయోగించే ఆఫీస్‌ స్పేస్‌, ఫర్నిచర్‌ వంటి ప్రాథమిక ఖర్చులను కంపెనీలు భరించేలా నిబంధనలను రూపొందించనున్నారు. వర్క్‌ ఫ్రమ్‌ హోంపై అధ్యయనం కోసం ప్రభుత్వం ఒక కన్సల్టెన్సీ సంస్థను నియమించనుంది.

చదవండి: 2021లో తెగ వాడేసిన ఎమోజీ ఇదేనండోయ్‌..!

మరింత జవాబుదారీగా..!
ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం వర్క్‌ ఫ్రమ్‌ హోంపై స్టాండింగ్‌ ఆర్డర్స్‌ను ఆమోదించడం ద్వారా పలు సేవారంగాల్లో వర్క్‌ ఫ్రమ్‌ హోంను  లాంఛనప్రాయం చేసింది. ఈ ఆర్డర్స్‌తో రిమోట్‌గా పని చేయాలని నిర్ణయించుకునే ముందు ఉద్యోగులు, కంపెనీలు పరస్పరం పని గంటల సమయాన్ని, ఇతర షరతులను సెట్ చేసుకోవడానికి వీలు కల్పించింది. అయితే వాస్తవికంగా పరిస్థితులు వేరేలా ఉన్నాయి. ఉద్యోగులను ఎక్కువ సమయం మేర పని చేయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకుగాను ఉద్యోగుల హక్కులను పరిరక్షించేందుకుగాను ఇటీవల పోర్చుగల్‌ వర్క్‌ ఫ్రమ్‌ హోం చట్టాలను అనుసరించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.  ఈ చట్టాలకు ఆమోదం లభిస్తే... వర్క్‌ ఫ్రమ్‌ హోం ఉద్యోగులకు చట్టపరమైన మద్దతును అందిచడంతో పాటుగా కంపెనీలకు  మరింత జవాబుదారీతనాన్ని జోడిస్తుంది.
చదవండి: అరెవ్వా..30 వెడ్స్‌ 21, సూర్య వెబ్‌సిరీస్‌లు అదరగొట్టాయే...! భారత్‌లోనే..

Videos

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)