amp pages | Sakshi

వాహనదారులకు అలర్ట్.. ఇక ఆ సర్టిఫికేట్ కూడా తప్పనిసరి!

Published on Thu, 03/03/2022 - 20:54

కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకీ రోడ్డు నిబంధనలను కఠినతరం చేస్తూ వస్తుంది. తాజాగా రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ(ఎంఓఆర్‌టీహెచ్‌) రోడ్డుపై నడిచే అన్ని వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికేట్'ని తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాలకు తప్పనిసరిగా ఫిట్‌నెస్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ మార్క్ వాలిడిటీని నిర్ణీత పద్ధతిలో చూపించడానికి కేంద్రం నేడు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిట్‌నెస్ సర్టిఫికేట్ వాహనం నెంబరు ప్లేట్ తరహాలోనే ఉంటుంది. దీని మీద వేహికల్ ఫిట్‌నెస్ గడువు తేదీని స్పష్టంగా కనబడుతుంది. ఈ సర్టిఫికేట్ DD-MM-YY ఫార్మట్'లో ఉండాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

భారీ వస్తువులు/ప్యాసింజర్ వాహనాలు, మీడియం గూడ్స్/ప్యాసింజర్ వాహనాలు, తేలికపాటి మోటారు వాహనాల విషయంలో విండ్ స్క్రీన్ ఎడమ వైపున ఎగువ అంచున దీనిని ప్రదర్శించాలని మంత్రిత్వ శాఖ తన  ప్రకటనలో తెలిపింది. ఆటో రిక్షాలు, ఈ-రిక్షాలు, ఈ-కార్ట్లు & క్వాడ్రిసైకిల్స్ విషయంలో విండ్ స్క్రీన్ ఎడమ వైపున ఎగువ అంచున ఈ సర్టిఫికేట్ ఉంటుంది. ఇక మోటార్ సైకిళ్లకు వాహనా మీద స్పష్టంగా కనిపించ భాగంలో దీనిన్ ఉంచాలని తెలిపింది. నోటిఫికేషన్ ప్రకారం, వాహనాలు టైప్ అరియాల్ బోల్డ్ స్క్రిప్ట్'లో నీలం బ్యాక్ గ్రౌండ్ పై పసుపు రంగులో సమాచారాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది.

ఇందుకు సంబంధించి రాబోయే 30 రోజుల్లో ప్రజలు, ఇతర వాటాదారులు సూచనలు చేయలని మంత్రిత్వ శాఖ కోరింది. ప్రభుత్వ డేటా ప్రకారం, భారతదేశంలో 20 ఏళ్లు పైబడిన 51 లక్షల లైట్ మోటార్ వాహనాలు ఉన్నాయి. అలాగే 15 ఏళ్ల కంటే ఎక్కువ లైఫ్ గల 34 లక్షల వాహనాలు దేశంలో ఉన్నాయి. 15 ఏళ్లు పైబడిన మరో 17 లక్షల మీడియం & హెవీ కమర్షియల్ వేహికల్స్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేకుండా ఉన్నాయి.

(చదవండి: కొత్త కారు కొనేవారికి బంప‌రాఫ‌ర్‌.. హోండా కార్లపై భారీగా డిస్కౌంట్‌!)

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)