amp pages | Sakshi

వాహనదారులకు అలర్ట్‌.. కొత్త రూల్‌..అమలులోకి వచ్చేది అప్పుడే..!

Published on Thu, 04/07/2022 - 18:44

సెంట్రల్ మోటర్ వెహికల్ రూల్స్ -1989 చట్టంను కేంద్ర ప్రభుత్వం  సవరించిన విషయం తెలిసిందే. ఈ సవరణలో భాగంగా ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలు రిజిస్టర్డ్ ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ATS) ద్వారా మాత్రమే ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందడాన్ని తప్పనిసరి చేస్తూ రోడ్డు రవాణా , రహదారుల మంత్రిత్వ శాఖ గురువారం (ఏప్రిల్‌ 7)న నోటిఫికేషన్ జారీ చేసింది. అన్నీ ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలు వచ్చే ఏడాది నుంచి ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల నుంచి మాత్రమే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా పొందాల్సి ఉంటుందని పేర్కొంది. 

8 ఏళ్ల పాత వాహనాలకు రెండు సంవత్సరాల పాటు, అంతకు మించిన పాత వాహనాలకు ఒక ఏడాది పాటు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఏటీఎస్‌ అందించనుంది. రోడ్డు రవాణా,రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం...హెవీ గూడ్స్ వెహికల్స్/హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్స్ కోసం ఏప్రిల్ 1, 2023 నుంచి, మీడియం గూడ్స్ వెహికల్స్/మీడియం ప్యాసింజర్ మోటార్ వెహికల్స్, లైట్ మోటర్ వెహికల్స్ (రవాణా) కోసం జూన్ 1, 2024 నుంచి వెరిఫికేషన్ తప్పనిసరి అవుతుందని నోటిఫికేషన్‌ వెల్లడించింది. ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ నిబంధనలలో మార్పులను ప్రతిపాదిస్తూ గతంలో డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కాగా తుది నోటిఫికేషన్‌ను జారీ చేయడానికి అభ్యంతరాలు లేదా సూచనలను లేవనెత్తడానికి 30 రోజుల సమయాన్ని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇచ్చింది.
 

ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ATS)ద్వారా వాహన  ఫిట్‌నెస్‌ని తనిఖీ చేయడానికి అవసరమైన వివిధ పరీక్షలను ఆటోమేట్ చేయడానికి మెకానికల్ పరికరాలతో చేయనుంది. ఈ టెస్టింగ్‌ కోసం  రాష్ట్ర ప్రభుత్వాలు, కంపెనీలు ఫిట్‌నెస్‌ను పరీక్షించడానికి ఏటీఎస్‌ పరీక్ష కేంద్రాలను నెలకొల్పేందుకు గత ఏడాది అనుమతులను జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. 

చదవండి: భారీ డీల్‌ను కైవసం చేసుకున్న టాటా మోటార్స్‌..!

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌