amp pages | Sakshi

రికార్డు స్థాయిలో జీఎస్‌టీ వ‌సూళ్లు

Published on Fri, 01/01/2021 - 18:25

సాక్షి, న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) వ‌సూళ్లు 2020  డిసెంబరు మాసంలో దుమ్మురేపాయి. కరోనా, లాక్‌డౌన్‌ సంక్షోభం తరువాత ఆర్థిక వ్యవస్థ వేగంగా  పుంజుకుంటోందన్న అంచనాల మధ్య జీఎస్‌టీ వసూళ్లు సరికొత్త రికార్డు సృష్టించడం గమనార్హం. ఏకంగా రూ.1.15 ల‌క్ష‌ల కోట్ల వ‌సూళ్ల‌తో జీఎస్‌టీ  ఆదాయం ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకింది. జీఎస్‌టీ వసూళ్ళు రూ.ల‌క్ష కోట్లు దాట‌డం వ‌రుస‌గా ఇది మూడోసారి. గత ఏడాది ఇదే నెలలో జీఎస్‌టీ ఆదాయంతో పోలిస్తే ఇది 12 శాతం ఎక్కువ.  ఈ స్థాయిలో వ‌సూళ్లు సాధించడం ఇదే తొలిసారని ఆర్థిక‌శాఖ శుక్రవారం వెల్ల‌డించింది. 

ఆర్థికమంత్రిత్వ శాఖ అందించినసమాచారం ప్రకారం డిసెంబరులో జీఎస్‌టీ ఆదాయం రూ. 15 1,15,174 కోట్లుగా నమోదైంది. ఇందులో సీజీఎస్‌టి 21,365 కోట్ల రూపాయలు, ఎస్‌జీఎస్‌టీరూ. 27,804 కోట్లు, ఐజీఎస్‌టీ  రూ. 57,426 కోట్లు (దిగుమతిపై వసూలు చేసిన, 27,050 కోట్లు)  సెస్, 8,579 కోట్లు (వస్తువుల దిగుమతులపై సేకరించిన 1 971 కోట్లతో సహా). నవంబరునెలకు సంబంధించి 2020 డిసెంబర్ 31 వరకు దాఖలు చేసిన జిఎస్‌టిఆర్-3 బీ రిటర్నులు మొత్తం 87 లక్షలుగా ఉన్నాయని ఆర్థిక శాఖ తెలిపింది. దేశీయ లావాదేవీల‌పై వ‌చ్చిన ఆదాయాల కంటే వ‌స్తువుల దిగుమ‌తి వ‌ల్ల వ‌చ్చిన ఆదాయం 27 శాతం ఎక్కువ‌గా ఉంది.  క‌రోనా త‌ర్వాత ఆర్థిక వ్య‌వ‌స్థ శ‌ర‌వేగంగా కోలుకోవ‌డం, జీఎస్టీ ఎగ‌వేత‌దారుల‌పై క‌ఠిన చ‌ర్య‌ల వ‌ల్ల ఈ భారీ వ‌సూళ్లు సాధ్య‌మైన‌ట్లు వెల్లడించింది.  

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌