amp pages | Sakshi

రికార్డు దిశగా భారత విదేశీ మారక నిల్వలు...!

Published on Sat, 06/19/2021 - 18:59

ముంబై: భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతున్నాయి. జూన్‌ 11తో ముగిసిన వారంలో వరుసగా రెండవవారమూ 600 బిలియన్‌ డాలర్ల ఎగువన సరికొత్త గరిష్ట స్థాయిలను నమోదుచేసుకున్నాయి. వారంవారీగా నిల్వలు 3.074 బిలియన్‌ డాలర్లు పెరిగి 608.081 బిలియన్‌ డాలర్లకు చేరాయి (డాలర్‌ మారకంలో రూపాయి ప్రస్తుత విలువ ప్రకారం  దాదాపు రూ.45 లక్షల కోట్లు) . శుక్రవారం ఆర్‌బీఐ తాజా గణాంకాలను విడుదల చేసింది.

2020 జూన్‌ 5తో ముగిసిన వారంలో మొట్టమొదటిసారి భారత్‌ ఫారెక్స్‌ నిల్వలు అర ట్రిలియన్‌ మార్క్‌దాటి 501.70 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అటు తర్వాత కొంచెం ఒడిదుడుకులు ఉన్నప్పటికీ,  నిల్వలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఏడాది తిరిగే సరికి నిల్వలు మరో 100 బిలియన్‌ డాలర్లు పెరిగాయి. జూన్‌ 4వతేదీతో ముగిసిన వారంలో మొదటిసారి 600 బిలియన్‌ డాలర్లను దాటి 605.008 డాలర్ల స్థాయికి చేరాయి.

తాజా సమీక్షా వారంలో ఈ దూకుడు కొనసాగింది. ప్రస్తుత నిల్వలు భారత్‌ 20 నెలల దిగుమతులకు  దాదాపు సరిపోతాయన్నది అంచనా. అంతర్జాతీయంగా భారత్‌ ఎకానమీకి వచ్చే కష్టనష్టాలను, ఒడిదుడుకులను ఎదుర్కొనడానికి ప్రస్తుత స్థాయి నిల్వలు దోహదపడతాయని ఈ నెల మొదట్లో జరిగిన ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష విశ్లేషించిన సంగతి తెలిసిందే.

గణాంకాలను విభాగాల వారీగా పరిశీలిస్తే..

  • మొత్తం నిల్వల్లో డాలర్ల రూపంలో చూస్తే ప్రధానమైన ఫారిన్‌ కరెన్సీ అసెట్స్‌ విలువ తాజా సమీక్షా వారంలో 2.567 బిలియన్‌ డాలర్లు పెరిగి 563.457 బిలియన్‌ డాలర్లకు చేరింది. 
  • పసిడి నిల్వలు 496 మిలియన్‌ డాలర్లు ఎగసి 38.101 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 
  • అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) వద్ద స్పెషల్‌ డ్రాయింగ్స్‌ రైట్స్‌ విలువ 1 మిలియన్‌ డాలర్లు తగ్గి 1.512 డాలర్లకు చేరింది.
  • ఐఎంఎఫ్‌ వద్ద భారత్‌ ఫారెక్స్‌ నిల్వల పరిమాణం 11 మిలియన్‌ డాలర్లు పెరిగి 5.011 బిలియన్‌ డాలర్లకు చేరాయి.

చదవండి: యూట్యూబ్‌ చూసి.. దెబ్బకి సెలబ్రిటీ అయిపోయాడు!

Videos

ఒకసారి తిరిగి చూసుకోండి..

బాబు కుట్రలు: సంక్షేమ పథకాల అమలును చంద్రబాబు అడ్డుకుంటున్నారు: అవంతి

చంద్రబాబు నడిచొస్తే ఒక కుట్ర.. నిలబడితే భూకంపం.. కన్నబాబు సెటైర్లు

చంద్రబాబుపై విద్యార్థుల కామెంట్స్

30 వేల కోట్ల ఆరోపణలపై పెద్దిరెడ్డి క్లారిటీ..!

జగన్ ప్రచార సభలో ఊహించని రెస్పాన్స్

చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలపై బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..!

పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుపుపై చిరంజీవి వీడియో..కొమ్మినేని స్ట్రాంగ్ రియాక్షన్

ఏపీ రాజధానిపై ఈనాడు తప్పుడు ప్రచారం ... కొమ్మినేని అదిరిపోయే కౌంటర్..

అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?