amp pages | Sakshi

తగ్గిన వృద్ధి వేగం

Published on Wed, 03/01/2023 - 00:14

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం తగ్గుతోంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులతో పాటు దేశంలో కీలక తయారీ రంగం కుంటుపడటం ఎకానమీ మందగమనానికి కారణమవుతోంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) మంగళవారం విడుదల చేసిన అక్టోబర్‌–నవంబర్‌–డిసెంబర్‌ (3వ త్రైమాసికం) గణాంకాల ప్రకారం, స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు మూడవ త్రైమాసికంలో 4.4 శాతంగా నమోదయ్యింది. అంతక్రితం గడచిన రెండు త్రైమాసికాల్లో (జూన్, సెప్టెంబర్‌) జీడీపీ వృద్ధి రేట్లు వరుసగా 13.5 శాతం, 6.3 శాతాలుగా నమోదయ్యాయి. 2021 ఇదే కాలంలో  భారత్‌ వృద్ధి రేటు 11.2%. ఈ లెక్కలు ఎకానమీ మందగమనాన్ని సూచిస్తున్నాయి.  

2021–22 వృద్ధి రేటు 9.1 శాతానికి పెంపు
2021–22 వృద్ధి అంచనాలను ఎన్‌ఎస్‌ఓ తాజాగా క్రితం 8.7 శాతం నుంచి 9.1 శాతానికి ఎగువముఖంగా సవరించడం కొంత ఊరట కలిగించే అంశం. 2020–21లో జీడీపీ విలువ రూ.136.87 లక్షల కోట్లు. 2021–22లో ఈ విలువ రూ.149.26 లక్షల కోట్లకు చేరింది. వెరసి వృద్ధి రేటు 9.1 శాతంగా నమోదయ్యిందన్నమాట. కరోనా తీవ్ర సంక్షోభం నేపథ్యంలో 2020–21లో ఎకానమీలో అసలు వృద్ధిలేకపోగా 5.8% క్షీణతను నమోదుచేసుకుంది. ఇక తలసరి ఆదాయం 2020–21 నుంచి 2021–22కు రూ.1,27,065 నుంచి రూ.1,48,524కు పెరిగింది. పెట్టుబడులకు సంబంధించి గ్రాస్‌ క్యాపి టల్‌ ఫార్మేషన్‌ కరెంట్‌ ప్రైస్‌ ప్రకారం, ఇదే కాలంలో రూ.55.27 లక్షల కోట్ల నుంచి రూ.73.62 లక్షల కోట్లకు ఎగసింది. స్థూల పొదుపులు రూ.57.17 లక్షల కోట్ల నుంచి రూ.70.77 లక్షల కోట్లకు ఎగశాయి.  

2022–23లో 7 శాతంగా అంచనా..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) భారత్‌ వృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని ఎన్‌ఎస్‌ఓ రెండవ ముందస్తు అంచనాలు పేర్కొంటున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అంచనాలకన్నా (6.8 శాతం) ఇది 20 బేసిస్‌ పాయింట్లు అధికంకావడం గమనార్హం.

4.4 శాతం వృద్ధి ఎలా అంటే..
ద్రవ్యోల్బణం సర్దుబాటు చేసిన స్థిర (2011–12 బేస్‌ ఇయర్‌) ధరల వద్ద 2021–22 అక్టోబర్‌–డిసెంబర్‌ మధ్య జీడీపీ విలువ రూ.38.51 లక్షల కోట్లు. 2022–23 ఇదే కాలంలో ఈ విలువ రూ.40.19 లక్షల కోట్లుగా తొలి అంచనాలు వేయడం జరిగింది. అంటే వృద్ధి రేటు 4.4 శాతమన్నమాట. ఇక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ప్రస్తుత ధరల వద్ద జీడీపీ వృద్ధి రేటు 11.2% వృద్ధితో రూ.62.39 లక్షల కోట్ల నుంచి రూ.69.38 లక్షల కోట్లకు చేరింది.  

కీలక రంగాల తీరిది...
► తయారీ: గ్రాస్‌ వ్యాల్యూ యాడెడ్‌ ప్రకారం (పరిశ్రమ లేదా ఆర్థిక వ్యవస్థలో ఒక రంగం వృద్ధి తీరు ఎలా ఉందన్న విషయాన్ని నిర్దిష్టంగా పరిశీలించడానికి దోహదపడే విధానం) 3వ త్రైమాసికంలో తయారీ రంగం ఉత్పత్తిలో అసలు వృద్ధి లేకపోగా 1.1 శాతం క్షీణించింది. 2021 ఇదే కాలంలో ఈ రంగం కనీసం 1.3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది.  
► వ్యవసాయం: మొత్తం ఎకానమీలో దాదాపు 15 శాతం వాటా ఉన్న ఈ రంగంలో వృద్ధి రేటు 3.7 శాతంగా ఉంది. 2022 ఇదే కాలంలో ఈ రేటు 2.2 శాతం.  
► మైనింగ్‌ అండ్‌ క్వారియింగ్‌: వృద్ధి రేటు 5.4 శాతం నుంచి 3.7 శాతానికి తగ్గింది.  
► నిర్మాణం: నిర్మాణ రంగంలో వృద్ధి రేటు 0.2 శాతం నుంచి 8.4 శాతానికి చేరింది.
► విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవలు: వృద్ధి 6 శాతం నుంచి 8.2 శాతానికి ఎగసింది.  
► ట్రేడ్, హోటెల్, రవాణా, కమ్యూనికేషన్, బ్రాడ్‌కాస్టింగ్‌ సేవలు: వృద్ధి 9.2 నుంచి 9.7 శాతానికి చేరింది.

2022–23పై అంచనాలు ఓకే
మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7 శాతం వృద్ధి రేటు నమోదవుతుందన్న అంచనాలు తగిన విధంగా, వాస్తవికతకు అద్దం పట్టేవిగా ఉన్నాయి. ఈ స్థాయి వృద్ధి సాధనకు భారత్‌ నాల్గవ త్రైమాసికంలో 5 నుంచి 4.1 శాతం వృద్ధి సాధించాల్సి ఉంటుంది. అయితే ఎల్‌నినో  వంటి వాతావరణ పరిస్థితులను తట్టుకోవడానికి భారత్‌ సిద్ధం కావాల్సి ఉంది.  
– వీ అనంత నాగేశ్వరన్, చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)