amp pages | Sakshi

భళా భారత్! ఐఎంఎఫ్‌ ఎండీ క్రిస్టలీనా జార్జీవా ప్రశంసల వర్షం!

Published on Fri, 04/22/2022 - 20:03

భారత్‌ అధిక వృద్ధి రేటు ఆ దేశానికి మాత్రమే ఆరోగ్యకరం కాదని.. మొత్తం ప్రంపచానికే సానుకూలమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ఎండీ క్రిస్టలీనా జార్జీవా అన్నారు. 2022లో భారత 8.2 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని, అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధించే దేశంగా నిలుస్తుందని ఐఎంఎఫ్‌ ఈ వారం మొదట్లోనే అంచనాలు ప్రకటించింది.

 2022లో అంతర్జాతీయ వృద్ధి రేటు 3.6 శాతానికి తగ్గించింది. 2021లో ఈ అంచనాలు 6.1 శాతంగా ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, అధిక ఇంధన, కమోడిటీల ధరల నేపథ్యంలో ఐఎంఎఫ్‌ అంచనాలు తగ్గించడం గమనార్హం. ‘‘అధిక వృద్ధి రేటు సాధిస్తున్న దేశాల్లో భారత్‌ ఒకటి. కొంత క్షీణత ఉన్నప్పటికీ. ఈ ఏడాదికి వృద్ధి రేటును 8.2 శాతంగా అంచనా వేయడం జరిగింది. ఇది ఇండియాకు ఆరోగ్యకరం. అంతేకాదు, వృద్ధి మందగమనాన్ని చూస్తున్న ప్రపంచానికి కూడా మంచిదే’’ అని జార్జీవా పేర్కొన్నారు. అంతర్జాతీయంగా భారత్‌ ఎంతో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. కరోనా సంక్షోభంలో టీకాలను సరఫరా చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

‘‘భారత్‌ అంతర్జాతీయ సోలార్‌ కూటమితో కలసి పునరుత్పాదక ఇంధన వనరులను పెంచుకునేందుకు కట్టుబడి ఉంది. డిజిటల్‌ కరెన్సీల్లో, ముఖ్యంగా సెంట్రల్‌ బ్యాంకు డిజిటల్‌ కరెన్సీ విషయంలో ముందున్న దేశం. భారత ప్రజలు, వ్యాపారాలకు క్రిప్టో రిస్క్‌లను తగ్గించడంలోనూ చొరవ చూపిస్తోంది. వచ్చే ఏడాది జీ20 సమావేశానికి అధ్యక్షత వహించే భారత్‌తో కలసి ఎన్నో అంశాల విషయంలో పనిచేయాలనుకుంటున్నాం’’అని జార్జీవా చెప్పారు.  

సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోగలదు 
కరోనా సంక్షోభం సమయంలో భారత్‌ అనుసరించిన స్థూల ఆర్థిక నిర్వహణ విజయవంతం కావడంతో వృద్ధి పరంగా వేగంగా కోలుకుందని ఐఎంఎఫ్‌ మిషన్‌ చీఫ్‌ (భారత్‌) నదాచౌరీ పేర్కొన్నారు. ఫలితంగా ఉక్రెయిన్‌ సంక్షోభం వల్ల ఎదురయ్యే ఆర్థిక సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే స్థితిలో ఉన్నట్టు చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ 7 శాతం వాటా పోషిస్తుండడం, కొనుగోలు శక్తికితోడు వేగంగా వృద్ధి చెందుతుండడాన్ని ప్రస్తావించారు. కరోనా సమయంలో ఎన్నో కీలకమైన చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.

Videos

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)