amp pages | Sakshi

కంప్యూటర్‌ సేవల ఎగుమతుల్లో భారత్‌ జూమ్‌!

Published on Tue, 04/18/2023 - 04:56

ముంబై: ప్రపంచ కంప్యూటర్‌ సేవల ఎగుమతుల్లో భారత్‌ వాటా మార్చితో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) దాదాపు 11 శాతానికి పెరిగిందని ఆర్థిక సేవల దిగ్గజం– డీబీఎస్‌ ఒక విశ్లేషణలో తెలిపింది. సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు రికా ర్డు స్థాయిలో 320 బిలియన్‌ డాలర్లకు చేరడం ఇందుకు దోహదపడినట్లు వివరించింది. 2021–22లో ఈ విలువ 255 బిలియన్‌ డాలర్లు.  డీబీఎస్‌ సీనియ ర్‌ ఎకనమిస్ట్‌ రాధికా రావు ఇందుకు సంబంధించిన వివరాలను తెలిపారు. ముఖ్యాంశాలు పరిశీలిస్తే..

► 2022–23 ట్రేడ్‌ డేటా విశ్లేషణ ప్రకారం, మొత్తం సేవల ఎగుమతి వాటాలో దేశం ఇప్పటికీ వెనుకబడి ఉంది. ఈ విభాగంలో మొత్తం భారత్‌ వాటా దాదాపు  4%మే.  
► సేవల వాణిజ్యం పనితీరు పనితీరు పటిష్టంగా ఉంది. అంతర్జాతీయ ఫైనాన్షియల్‌ అంశాల్లో పటిష్టతకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా కలిసిన వచ్చే అంశం ఇది. కమోడిటీ ధరలు తగ్గడం కూడా భారత్‌కు విదేశీ మారకం పరంగా సానుకూలత కల్పిస్తోంది.  
► 2022–23లో సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు రికార్డు స్థాయిలో 320 బిలియన్‌ డాలర్లకు చేరగా,  సర్వీసెస్‌ ట్రేడ్‌ మిగులు 142 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2021–22తో పోల్చితే, ఈ విలువ 30 శాతం పెరిగింది.  సర్వీసెస్‌ దిగుమతులు కూడా భారీగా పెరగడం దీనికి నేపథ్యం.  
► వస్తు, సేవలు కలిపి 2022–23లో ఎగుమతులు కొత్త రికార్డులో 14 శాతం వృద్ధి నమోదయ్యింది. విలువలో 770 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఒక్క సేవల ఎగుమతులు చూస్తే, 27.16 శాతం పెరిగి 323 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.  ఇక మొత్తం దిగుమతులు 17 శాతం పెరిగి 892 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు వాణిజ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  
► కంప్యూటర్‌ సేవల ఎగుమతులు పటిష్ట స్థాయిలో ఉండడం కరెంట్‌ అకౌంట్‌ లోటు (దేశంలోకి ఒక నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారక ద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) 2% లోపు (2022–23 జీడీపీలో) కట్టడిలో ఉండడానికి కారణం.  
► బ్యాలెన్స్‌ ఆఫ్‌ పేమెంట్స్‌ కింద సేవల ట్రేడ్‌ వాటా 2019లో 3 శాతం (జీడీపీలో) ఉంటే, 2022 నాటికి ఇది 4.6 శాతానికి ఎగసింది. 2023లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.  
► సేవల ఎగుమతి పెరుగుదల్లో  కంప్యూటర్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, టెలికం సంబంధిత రంగాలు పటిష్టంగా ఉన్నాయి. మొత్తం సేవల ఎగుమతులలో వీటి వాటా దాదాపు సగం ఉంది  
► సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల్లో అమెరికా 55.5% వాటాతో అగ్ర స్థానంలో ఉంటే, యూరప్‌ తరువాతి స్థానంలో ఉంది. ఇందులో బ్రిటన్‌ది మొదటి స్థానం.

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌