amp pages | Sakshi

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో తగ్గనున్న పెట్టుబడులు!

Published on Fri, 12/24/2021 - 09:19

న్యూఢిల్లీ: రియల్‌ ఎస్టేట్‌ రంగంలో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు 2021లో 20 శాతం మేర తగ్గొచ్చని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సేవల సంస్థ జేఎల్‌ఎల్‌ ఇండియా అంచనా వేసింది. 2020లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడం దీనికి ప్రధాన కారణంగా పేర్కొంది.

ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఇనిస్టిట్యూషనల్‌ పెట్టుబడులు 298 కోట్ల డాలర్లుగా (రూ.22,350కోట్లు) ఉన్నాయి. 2020 ఇదే కాలంలో పెట్టుబడులు 153 కోట్ల డాలర్లతో (రూ11,475) పోలిస్తే సుమారు రెట్టింపయ్యాయి. కానీ, 2020 చివరి మూడు నెలల్లో భారీ ఒప్పందాలు (3.2 బిలియన్‌ డాలర్ల మేర) నమోదయ్యాయి. దీంతో 2020 మొత్తం మీద ఇనిస్టిట్యూషనల్‌ పెట్టుబడులు 5 బిలియన్‌ డాలర్లకు దూసుకుపోయాయి. ఈ ఏడాది ఆ పరిస్థితి ఉండకపోవచ్చన్నది జేఎల్‌ఎల్‌ అంచనా. భారీ పెట్టుబడుల ఒప్పందాలు చోటు చేసుకుంటే మినహా.. 2021 మొత్తం మీద రియల్‌ ఎస్టేట్‌ రంగంలో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు 3.8–4 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉంటాయని పేర్కొంది.   

వచ్చే ఏడాది ఆశాజనకమే 
2022పై ఆశావహ అంచనాలనే జేఎల్‌ఎల్‌ ఇండియా వ్యక్తం చేసింది. 5 బిలియన్‌ డాలర్ల మార్క్‌ను (రూ.37,500 కోట్లు) అధిగమించొచ్చని పేర్కొంది. 2017–2020 మధ్య పరిశ్రమలోకి ఇదే స్థాయిలో పెట్టుబడులు వార్షికంగా రావడం గమనార్హం. ఫ్యామిలీ ఆఫీసులు, విదేశీ కార్పొరేట్‌ గ్రూపులు, విదేశీ బ్యాంకులు, పెన్షన్‌ ఫండ్స్, ప్రైవేటు ఈక్విటీ సంస్థలను ఇనిస్టిట్యూషన్స్‌గా పేర్కొంటారు. ఫ్యామిలీ ఆఫీసులు అంటే బడా పారిశ్రామికవేత్తలు, సంపన్నుల వ్యక్తిగత పెట్టుబడుల వేదికలు.

Videos

ఆధారాలు ఉన్నా..నో యాక్షన్..

వైఎస్ఆర్ సీపీనే మళ్ళీ గలిపిస్తాం

ఇండియా కూటమిపై విరుచుకుపడ్డ ప్రధాని

జగన్ వెంటే జనమంతా..

బాబు, పవన్ కు కర్నూల్ యూత్ షాక్

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)