amp pages | Sakshi

నటుడి అంతరిక్ష ప్రయాణం.. వాయిదా!

Published on Mon, 10/11/2021 - 09:23

ఆయనొక లెజెండరీ నటుడు. ఓ టెలివిజన్‌ సిరీస్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్‌ డమ్‌ సంపాదించుకున్నారు. అదీ అంతరిక్షానికి ముడిపడిన కథతో నడిచే సిరీస్‌ కావడం విశేషం. అలాంటి నటుడితో.. స్పేస్‌ టూరిజం బిజినెస్‌ను పెంచుకోవాలన్న బ్లూ ఆరిజిన్‌ ప్రయత్నానికి స్పీడ్‌ బ్రేకర్‌ ఎదురైంది ఇప్పుడు. 


60వ దశకలో ప్రపంచాన్ని ఓ ఊపు ఊపిన ‘స్టార్‌ ట్రెక్‌’ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నాడు  కెనడియన్‌ నటుడు విలియమ్‌ షాట్‌నర్‌.  కెప్టెన్‌ జేమ్స్‌ క్రిక్‌ రోల్‌లో ఆయన నటన అమోఘం.  అయితే ఈయన్ని అంతరిక్ష ప్రయాణం చేయించడం ద్వారా బ్లూ ఆరిజిన్‌ స్పేస్‌ టూరిజం బిజినెస్‌ పెంచాలని భావించారు సదరు ప్రైవేట్‌ స్పేస్‌ ఏజెన్సీ బాస్‌ జెఫ్‌ బెజోస్‌.  అక్టోబర్‌ 12న బ్లూ ఆరిజిన్‌ సబ్‌ఆర్బిటల్‌ రాకెట్‌(ఎన్‌ఎస్‌-18) ద్వారా అంతరిక్ష ప్రయాణానికి అంతా సిద్ధం కూడా చేశారు. 

ఈ దశలో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. బలమైన ఈదురుగాలులతో రాకెట్‌ లాంఛింగ్‌కు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మంగళవారం ప్రయోగం ఉండబోదని బ్లూ ఆరిజిన్‌ మిషన్‌ ఆపరేషన్స్‌ టీం ప్రకటించింది. బుధవారానికి మిషన్‌ను వాయిదా వేశామని, అయితే వాతావరణం అనుకూలించకపోతే ఆరోజు కూడా ప్రయోగం ఉండదని స్పష్టం చేసింది. 

చదవండి: బెజోస్‌.. కొంపముంచిన అంతరిక్ష యాత్ర!

ఒకవేళ 90 ఏళ్ల షాట్‌నర్‌ అంతరిక్షంలోకి గనుక వెళ్లొస్తే.. అంతరిక్ష యానం పూర్తిచేసిన అత్యధిక వయసు ఫీట్‌ దక్కించుకున్న వ్యక్తి అవుతారు. గతంలో నాసా అంతరిక్ష వ్యోమగామి జాన్‌ గ్లెన్‌ 77 ఏళ్ల వయసులో డిస్కవరీ షటిల్‌(1998) ద్వారా యానం పూర్తి చేయగా, అమెరికన్‌ ఏవియేటర్‌ వాలీ ఫంక్‌(82) ఈ ఏడాది జులైలో బ్లూ ఆరిజిన్‌ విజయవంతంగా పూర్తి చేసిన అంతరిక్ష యానం ద్వారా ఆ ఫీట్‌ బ్రేక్‌ చేశారు . అయితే వాలీఫంక్‌ వెళ్లొచ్చింది.. ఇప్పుడు షాట్‌నర్‌ వెళ్లొచ్చేది కార్మన్‌ లైన్‌ దాకా మాత్రమే. ఇది భూమ్మీద నుంచి 100 కిలోమీటర్ల ఎత్తు మాత్రమే ఉంటుంది.

చదవండి: 10 నిమిషాల అంతరిక్ష యాత్ర.. ఖర్చు రూ.205 కోట్లు!

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌