amp pages | Sakshi

Jio: తగ్గేదె లే అంటున్న జియో!

Published on Wed, 11/17/2021 - 17:54

న్యూఢిల్లీ: టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. అక్టోబర్ నెలలో 4జీ సర్వీస్ ప్రొవైడర్లలో రిలయన్స్ జియో సెకనుకు 21.9 మెగాబిట్ డేటా డౌన్‌లోడ్ వేగంతో తన అగ్ర స్థానాన్ని నిలుపుకుంది. అలాగే, భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియా డేటా డౌన్‌లోడ్ వేగంలో పెరిగినట్లు పేర్కొంది. గతంతో పోలిస్తే డేటా డౌన్‌లోడ్ వేగం పరంగా భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియా, జియో నెట్‌వర్క్ మధ్య అంతరం తగ్గుతుంది. 4జీ  డేటా డౌన్‌లోడ్ వేగం స్వల్పంగా తగ్గిన తర్వాత అక్టోబర్ నెలలో జియో నెట్‌వర్క్ జూన్ నెలలో నమోదైన 21.9 ఎంబిపిఎస్ డౌన్‌లోడ్ వేగాన్ని అందుకుంది.

భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియా డేటా డౌన్‌లోడ్ వేగం దాదాపు రెండున్నర రెట్లు పెరిగాయి. ఎయిర్‌టెల్‌ 4జీ డేటా డౌన్‌లోడ్ వేగం జూన్ నెలలో ఉన్న 5 ఎంబిపిఎస్ నుంచి అక్టోబర్ నెలలో 13.2 ఎంబిపిఎస్ కు పెరిగింది. ఇంకా, వొడాఫోన్ ఐడియా డేటా డౌన్‌లోడ్ వేగం ఐదు నెలల్లో 6.5 ఎంబిపిఎస్ నుంచి 15.6 ఎంబిపిఎస్'కు పెరిగింది. అయితే, అక్టోబర్ నెలలో 4జీ డేటా అప్‌లోడ్ వేగం పరంగా వొడాఫోన్ ఐడియా తన అగ్రస్థానాన్ని కొనసాగించింది.

వొడాఫోన్ ఐడియా కంపెనీ 7.6 ఎంబిపిఎస్ అప్‌లోడ్ వేగాన్ని నమోదు చేసింది. ఈ వేగం గత ఐదు నెలల్లో అత్యధికం. అదేవిధంగా, ఎయిర్‌టెల్‌, రిలయన్స్ జియో నెట్‌వర్క్ అప్‌లోడ్ వేగం అక్టోబర్ నెలలో గత ఐదు నెలలతో పోలిస్తే గరిష్ట స్థాయిలో 5.2 ఎంబిపిఎస్, 6.4 ఎంబిపిఎస్ వేగాన్ని నమోదు చేశాయి. రియల్ టైమ్ ప్రాతిపదికన మైస్పీడ్ అప్లికేషన్ సాయంతో భారతదేశం అంతటా సేకరించే డేటా ఆధారంగా ట్రాయ్ ద్వారా సగటు వేగం లెక్కిస్తుంది. 

(చదవండి: నెలకు లక్షల్లో జీతాలు.. నెలాఖరుకు జేబులు ఖాళీ!)

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)