amp pages | Sakshi

జియో నుంచి మరో సంచలనం..! అత్యంత తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్‌..!

Published on Wed, 01/26/2022 - 11:38

జియో రాకతో భారత టెలికాం రంగంలో పెను సంచలనాలు నమోదైన విషయం తెలిసిందే. భారత్‌లో డిజిటల్‌ సాధికారితను సాధించేందుకు గాను అత్యంత తక్కువ ధరకే జియోఫోన్‌ నెక్ట్స్‌ 4జీ  స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్‌ తీసుకొచ్చింది. జియో, గూగుల్‌ భాగస్వామ్యంతో  జియోఫోన్‌ నెక్ట్స్ స్మార్ట్‌ఫోన్‌ను  రూపొందించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు మరో సంచలనానికి రిలయన్స్‌ జియో తెర తీయనుంది. త్వరలోనే అత్యంత చవకైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్‌  లాంచ్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

అత్యంత చవకైన 5జీ స్మార్ట్‌ఫోన్‌..!
భారత్‌లో 5G విప్లవం ఈ ఏడాది నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 5జీ విస్తరణలో రిలయన్స్ జియో ముందంజలో నిలుస్తోంది. అందుకు తగ్గట్టుగా 5జీ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేసే పనిలో రిలయన్స్‌ నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్‌ జియో లాంచ్‌ చేసే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో అత్యంత చవకైన 5జీ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచే​ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ధర ఎంతంటే..?
5జీ స్మార్ట్‌ఫోన్స్‌లో అధిపత్యాన్ని చెలాయిస్తోన్న రియల్‌మీ, రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్స్‌కు పోటీగా రిలయన్స్‌ జియో 5జీ స్మార్ట్‌ఫోన్‌ తీసుకురానుంది. ప్రస్తుతం 5జీ స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో రూ. 13 వేలకు అందుబాటులో ఉంది. దీని కంటే తక్కువ ధరకు 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్‌ జియో లాంచ్‌ చేసే అవకాశం ఉంది. ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ దాదాపు రూ. 10 వేలకు లభించనుంది.  

రిలయన్స్‌ జియోఫోన్‌ 5జీ స్పెసిఫికేషన్స్‌ (అంచనా)

  • 6.5-అంగుళాల హెచ్‌డీ LCD డిస్‌ప్లే
  • క్వాలకం స్నాప్‌డ్రాగన్‌ 480 ప్రాసెసర్‌
  • ప్రగతి ఓఎస్‌ బదులుగా ఆండ్రాయిడ్‌ ఓఎస్‌
  •  4GB RAM+ 32GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌
  • 13-ఎంపీ+2-ఎంపీ రియర్‌ కెమెరా
  • 8-ఎంపీ సెల్ఫీ కెమెరా
  • మైక్రో SD కార్డ్ స్లాట్‌
  • N3, N5, N28, N40, N78 బ్యాండ్‌ సపోర్ట్‌
  •  18W ఫాస్ట్ ఛార్జింగ్‌
  • సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
  • 5000mAh బ్యాటరీ
  • USB-C సపోర్ట్

చదవండి: బహుశా..! ప్రపంచంలోనే అత్యంత పవర్‌ఫుల్‌ స్మార్ట్‌ఫోన్‌ ఇదేనేమో..!

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌