amp pages | Sakshi

కళ్లు చెదిరే లుక్స్‌తో కియా నుంచి కొత్త ఎస్‌యూవీ..!

Published on Fri, 10/22/2021 - 13:46

దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా తన వాహన శ్రేణిలో మరో కొత్త ఎస్‌యూవీను తీసుకురానుంది. అందుకు సంబంధించిన టీజర్‌ను కియా రిలీజ్‌ చేసింది. ఈ కొత్త ఎస్‌యూవీ పేరును కంపెనీ ఇంకా రివీల్‌ చేయలేదు. కాగా కియా కార్లలోని స్పోర్టేజ్‌ ఎస్‌యూవీ మోడల్‌కు కొత్త జనరేషన్‌ కారుగా ఈ కారు నిలుస్తోందని ఆటోమొబైల్‌ రంగ నిపుణులు భావిస్తున్నారు.


తొలుత అమెరికన్‌  మార్కెట్లలో  ఈ కారును అక్టోబర్‌ 27 న లాంచ్‌ చేయనున్నుట్లు తెలుస్తోంది. భారత మార్కెట్లలోకి కియా న్యూ ఎస్‌యూవీ మోడల్‌ను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  



కియా నుంచి వస్తోన్న ఈ కారు ఫ్రంట్‌ వీల్‌, ఆల్‌ వీల్‌ డ్రైవ్‌ ఆప్షన్స్‌తో రానుంది. కారులో మల్టీపుల్‌ స్టాండర్డ్‌ అడ్వాన్స్‌డ్‌ డ్రైవింగ్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌, హై టెక్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ను అమర్చారు. టీజర్‌లో భాగంగా ఈ కారులో టైగర్‌ నోస్‌ గ్రిల్‌ బోల్డ్‌ ఫ్రంట్‌ ఫేస్‌తో కారు ముందుభాగం ఉండనుంది. బూమ్‌ర్యాంగ్‌ ఆకారంలో ఫ్రంట్‌ ఎల్‌ఈడీ లైట్లను కల్గి ఉంది.

ఫ్రంట్‌ వీల్‌ డ్రైవ్‌ అంటే..!
ఫ్రంట్‌ వీల్‌ డ్రైవ్‌ ఆప్షన్‌లో కారు ఇంజిన్‌ ముందు టైర్లకు శక్తినిస్తోంది.

ఆల్‌ వీల్‌ డ్రైవ్‌  అంటే..!
ఈ ఆప్షన్‌లో ఇంజిన్‌ కారు ముందు టైర్లకు, వెనుక టైర్లకు శక్తిని అందిస్తోంది




ఇంజిన్‌ విషయానికి వస్తే..!
కియా స్పోర్టేజ్‌ మోడల్‌ మాదిరిగానే 1.6 లీటర్‌ టర్బో ఫోర్‌ సిలిండర్‌ ఇంజిన్‌ను అమర్చారు.  177 బీహెచ్‌పీ సామర్థ్యంతో 265ఎన్‌ఎమ్‌ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది.    
చదవండి: టెస్లా కార్లపై నీతి ఆయోగ్‌ కీలక వ్యాఖ్యలు...!

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)