amp pages | Sakshi

లాజిస్టిక్స్‌ కంపెనీలకు వ్యాక్సిన్ల బూస్ట్‌

Published on Fri, 12/11/2020 - 15:02

ముంబై, సాక్షి: భారత్‌సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు కోవిడ్‌-19 కట్టడికి వ్యాక్సిన్ల వినియోగానికి సన్నాహలు చేస్తున్న నేపథ్యంలో లాజిస్టిక్స్‌ కంపెనీలకు ఆర్డర్లు పెరగనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల యూఎస్‌ దిగ్గజం ఫైజర్‌ వ్యాక్సిన్‌కు యూకే, బెహ్రయిన్‌, కెనడా అనుమతించగా.. తాజాగా యూఎస్‌ అదే బాట పట్టనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఇక దేశీయంగానూ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్, భారత్‌ బయోటెక్‌ తదితర కంపెనీలు వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతుల సన్నాహాల్లో ఉన్నాయి. కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను ఎమర్జెన్సీ ప్రాతిపదికన వినియోగించేందుకు అనుమతించవలసిందిగా డీసీజీఐకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ ఇప్పటికే దరఖాస్తు చేసింది. తద్వారా కోవిడ్‌-19 కట్టడికి దేశీయంగా ఒక వ్యాక్సిన్‌ వినియోగం కోసం డీజీసీఐకు దరఖాస్తు చేసిన తొలి దేశీ కంపెనీగా సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిలవగా.. ఐసీఎంఆర్‌ సహకారంతో కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌పై సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ దేశీయంగా మూడో దశ క్లినికల్‌ పరీక్షలను చేపట్టిన విషయం విదితమే. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్‌ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందించిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌పై మరోపక్క యూకే, బ్రెజిల్‌లోనూ తుది దశ క్లినికల్‌ పరీక్షలను నిర్వహిస్తున్నారు. (ఇక యూఎస్‌లోనూ ఫైజర్‌ వ్యాక్సిన్‌!)

ఎంవోయూ
కోవిడ్‌-19 కట్టడికి వినియోగించనున్న వ్యాక్సిన్ల సరఫరా, పంపిణీలకు వీలుగా గురువారం దేశీ కంపెనీలు స్పైస్‌జెట్‌, స్నోమ్యాన్‌ లాజిస్టిక్స్‌ అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. తద్వారా చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ వ్యాక్సిన్ల సరఫరాకు శీతలీకరణ సౌకర్యాలతో కూడిన ఎయిర్‌ కనెక్టివిటీ సర్వీసులు అందించనుంది. వీటికి జతగా లాజిస్టిక్స్‌ కంపెనీ స్నోమ్యాన్‌ భూమిమీద శీతల గిడ్డంగులు, ప్యాకింగ్‌, స్టోరేజీ, పంపిణీ తదితర సేవలు అందించనుంది. వెరసి ఎండ్‌టు ఎండ్‌ సర్వీసులు అందించే ప్రణాళికల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం స్పైస్‌జెట్‌, స్నోమ్యాన్‌ లాజిస్టిక్స్‌ షేర్లు బలపడిన విషయం విదితమే. ఈ బాటలో మరోసారి స్పైస్‌జెట్‌ షేరు 3 శాతం పుంజుకుని రూ. 103కు చేరగా.. తాజాగా లాజిస్టిక్స్‌ కంపెనీల కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. పలు కౌంటర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. (దేశీయంగా వ్యాక్సిన్‌కు అనుమతించండి)

షేర్ల జోరు
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో నవకార్‌ కార్పొరేషన్‌ 10 శాతం దూసుకెళ్లి రూ. 42.95కు చేరింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ఆల్‌కార్గో లాజిస్టిక్స్‌ 4 శాతం ఎగసి రూ. 145 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 155 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. వరుసగా రెండో రోజు స్నోమ్యాన్‌ లాజిస్టిక్స్‌ 5.5 శాతం జంప్‌చేసి రూ. 65 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ. 70 వద్ద ఏడాది గరిష్టానికి చేరింది. ఈ బాటలో మహీంద్రా లాజిస్టిక్స్‌ 5 శాతం పెరిగి రూ. 410 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 428 వరకూ ఎగసింది. ఇదేవిధంగా సికాల్‌ లాజిస్టిక్స్‌ 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి రూ. 18.30 వద్ద, పటేల్‌ ఇంటిగ్రేటెడ్‌ 10 శాతం వృద్ధితో రూ. 31.25 వద్ద ఫ్రీజయ్యాయి. ఇతర కౌంటర్లలో గతి, వీఆర్‌ఎల్‌ లాజిస్టిక్స్‌ సైతం ప్రస్తావించదగ్గ లాభాలతో కదులుతున్నాయి.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)