amp pages | Sakshi

తిరుగులేని మోడల్‌, సరికొత్త రికార్డ్‌లను క్రియేట్‌ చేసిన మారుతి

Published on Wed, 09/15/2021 - 08:08

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీలో ఉన్న మారుతి సుజుకీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ స్విఫ్ట్‌ కారు కొత్త రికార్డు సృష్టించింది. గడిచిన 16 ఏళ్లలో మొత్తం 25 లక్షల పైచిలుకు స్విఫ్ట్‌ కార్లు రోడ్డెక్కాయి. విక్రయాల పరంగా గత ఆర్థిక సంవత్సరంలో ఈ మోడల్‌ ముందంజలో ఉంది. 

భారత్‌లో 2005లో స్విఫ్ట్‌ రంగ ప్రవేశం చేసింది. రూపు, సామర్థ్యం పరంగా అద్భుతమైన వారసత్వాన్ని ఈ మోడల్‌ సృష్టించిందని కంపెనీ మార్కెటింగ్, సేల్స్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు. ‘ఈ విజయం బ్రాండ్‌ స్విఫ్ట్‌ పట్ల వినియోగదారులు, విమర్శకుల ప్రేమకు నిదర్శనం. 35 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న 52 శాతం మంది వినియోగదార్లతో.. యువ కస్టమర్ల మారుతున్న ఆకాంక్షలకు అనుగుణంగా స్విఫ్ట్‌ నిరంతరం కొత్తదనాన్ని సంతరించుకుంటోంది’ అని వివరించారు. 

1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్, మాన్యువల్, ఆటో గేర్‌ షిఫ్ట్‌ ట్రాన్స్‌మిషన్‌తో ఈ కారు రూపుదిద్దుకుంది. ట్రాన్స్‌మిషన్‌నుబట్టి లీటరుకు 23.20–23.76 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. 

చదవండి: పండుగ సెంటిమెంట్‌, కార్లను తెగకొనేస్తున్నారు

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)