amp pages | Sakshi

న్యుయాన్స్‌.. మైక్రోసాఫ్ట్‌ సొంతం

Published on Tue, 04/13/2021 - 06:33

న్యూయార్క్‌: ఇటీవల ఇతర కంపెనీలను సొంతం చేసుకోవడం ద్వారా వేగవంత వృద్ధి సాధిస్తున్న గ్లోబల్‌ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ తాజాగా మరో భారీ డీల్‌కు తెరతీసింది. నాస్‌డాక్‌ లిస్టెడ్‌ స్పీచ్‌ రికగ్నిషన్‌ కంపెనీ న్యుయాన్స్‌ కమ్యూనికేషన్స్‌ను కొనుగోలు చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. డీల్‌ విలువ 16 బిలియన్‌ డాలర్లు(రూ. 1,20,000 కోట్లు)కాగా..  ఒక్కో షేరుకీ 56 డాలర్ల చొప్పున చెల్లించనుంది. శుక్రవారం ముగింపు ధర 45.58 డాలర్లతో పోలిస్తే ఇది 23 శాతం ప్రీమియంకాగా.. తాజా వార్తలతో సోమవారం(12) ట్రేడింగ్‌లో న్యుయాన్స్‌ షేరు ప్రారంభంలోనే 16.6 శాతం జంప్‌చేసింది. 53.16 డాలర్లకు చేరింది. ఇక మైక్రోసాఫ్ట్‌ షేరు దాదాపు యథాతథంగా 256 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

లింక్డ్‌ఇన్‌ తర్వాత భారీ డీల్‌...
రుణాలతో కలిపి న్యుయాన్స్‌ కమ్యూనికేషన్స్‌ విలువను 19.7 బిలియన్‌ డాలర్లుగా మైక్రోసాఫ్ట్‌ మదిం పు చేసింది. వెరసి ఐదేళ్ల తదుపరి భారీ డీల్‌ను కుదుర్చుకుంది. ఇంతక్రితం 2016లో లింక్డ్‌ఇన్‌ను 26 బిలియన్‌ డాలర్లకు మైక్రోసాఫ్ట్‌ కొనుగోలు చే సింది. ఈ బాటలో గతేడాది సెప్టెంబర్‌లో వీడియో గేమ్‌ తయారీ సంస్థ జెనీమ్యాక్స్‌ను 7.5 బిలియన్‌ డాలర్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

2019 నుంచీ...
న్యుయాన్స్‌తో 2019లోనే మైక్రోసాఫ్ట్‌ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. న్యుయాన్స్‌ కొనుగోలు ద్వారా హెల్త్‌కేర్‌ పరిశ్రమలో అందిస్తున్న   సేవలు రెట్టింపు కానున్నట్లు మైక్రోసాఫ్ట్‌ పేర్కొంది. న్యుయాన్స్‌ సీఈవోగా మార్క్‌   బెంజమిన్‌ కొనసాగనున్నట్లు తెలియజేసింది. గతేడాదిలో ప్రవేశపెట్టిన హెల్త్‌కేర్‌ క్లౌడ్‌ ప్రొడక్టులకు న్యుయాన్స్‌ సాంకేతికతను వినియోగించుకోనున్నట్లు వెల్లడించింది.

Videos

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)