amp pages | Sakshi

స్మార్ట్ ఫోన్స్ తయారీకి చిప్‌ల కొరత

Published on Mon, 12/28/2020 - 17:29

న్యూఢిల్లీ: భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించడానికి 48,000 కోట్లతో భారత ప్రభుత్వం మూడు పథకాలను ఆవిష్కరించింది. అందులో ఒకటి ప్రొడక్షన్ లింక్డ్ ప్రోత్సాహక(పీఎల్‌ఐ) పథకం. ఈ పథకంలో భాగంగా వచ్చే ఐదేళ్లలో 10.5 లక్షల కోట్ల రూపాయల మొబైల్ ఫోన్‌ల తయారీ కోసం పీఎల్‌ఐ పథకం కింద దేశీయ, అంతర్జాతీయ సంస్థల నుండి 16 ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాయి. వీటిని పరిశీలించిన ప్రభుత్వం గత అక్టోబర్‌లో కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రూ.11 వేల కోట్లను కూడా విడుదల చేసింది. తాజాగా ప్రొడక్షన్ లింక్డ్ ప్రోత్సాహక(పీఎల్‌ఐ) పథకం కింద ఎలక్ట్రానిక్స్ చిప్స్ తయారుచేసే కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అనుకున్న ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునే అవకాశం లేదు అని ప్రభుత్వానికి పేర్కొన్నాయి.(చదవండి: అత్యంత ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్)

మొబైల్ పరికరాల పరిశ్రమ సంస్థ(ఐసీఇఎ)లో సభ్యులైన ఆపిల్, ఫాక్స్కాన్, విస్ట్రాన్ మరియు లావా ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఐటి కార్యదర్శి అజయ్ ప్రకాష్ సాహ్నీకి డిసెంబర్ 24న ఒక లేఖ రాసాయి. అందులో కోవిడ్ -19 చేత సరఫరా పరిమితులతో ఏర్పడిన కొరత కారణంగా పీఎల్‌ఐ పథకం కింద గతంలో విధించుకున్న లక్ష్యాలను చేరుకోక పోవచ్చని తెలిపాయి. "పీఎల్‌ఐ పథకం కింద చేరిన కంపెనీలు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వీటిలో చాలా కంపెనీలు అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు కానీ 2021-22 ఆర్థిక సంవత్సరంలో కాదని" ఐసిఇఎ చైర్మన్ పంకజ్ మొహింద్రూ లేఖలో తెలిపారు.    ‌

ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్(ఐసీఇఎ) గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రానిక్ చిప్‌ల కొరతకు కారణాలను వివరించింది. చైనా టెక్నాలజీ దిగ్గజం "హువావే" సంస్థ ఎలక్ట్రానిక్‌ చిప్స్‌, ప్రాసెసర్ల సరఫరాపై గత సెప్టెంబర్ లో అమెరికా నిషేధం విధించింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని హువావే 2 సంవత్సరాలకు సరిపడా చిప్‌లను దిగుమతి చేసుకుంది. దీని ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చిప్‌ల కొరత తీవ్రంగా ఉందని తెలిపింది. దింతో వివిధ దేశాలకు చెందిన సంస్థలు 97 శాతం సరఫరా భారత దేశ తయారీ కంపెనీలకు నిలిపివేశాయని మోహింద్రూ చెప్పారు. అంతర్జాతీయ విమాన నిషేధంతో పాటు ఇతర లాజిస్టిక్స్ ఇష్యూ కారణంగా పీఎల్‌ఐ పథకం ప్రారంభించడానికి నాలుగు నెలల ముందు పలు కంపెనీల కార్యకలాపాలు దెబ్బతిన్నాయని ఐసీఇఎ తెలిపింది. పీఎల్‌ఐ పథకం కింద ప్రోత్సాహకం కోసం కాలపరిమితులను సర్దుబాటు చేయాలని పరిశ్రమల సంఘం కోరింది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)