amp pages | Sakshi

వాహన విక్రయాలకు చిప్‌ సెగ

Published on Sat, 12/11/2021 - 02:58

న్యూఢిల్లీ: దేశీ ఆటోమొబైల్‌ పరిశ్రమను సెమీకండక్టర్ల కొరత వెంటాడుతోంది. చిప్‌ల సమస్య కారణంగా ఉత్పత్తి.. డెలివరీలు దెబ్బతినడంతో నవంబర్‌లో ప్యాసింజర్‌ వాహనాల (పీవీ) విక్రయాలు 19 శాతం క్షీణించాయి. దేశీ ఆటోమొబైల్‌ తయారీ సంస్థల సమాఖ్య సియామ్‌ శుక్రవారం ఈ విషయాలు వెల్లడించింది. 

సియామ్‌ గణాంకాల ప్రకారం గత నెల డీలర్లకు కార్ల వంటి ప్యాసింజర్‌ వాహనాల సరఫరా 2,15,626కి పరిమితమైంది. గతేడాది నవంబర్‌లో నమోదైన 2,64,898 యూనిట్లతో పోలిస్తే 19 శాతం క్షీణించింది. అటు ద్విచక్ర వాహన విక్రయాలు ఏకంగా 34 శాతం పడిపోయాయి. 16,00,379 యూనిట్ల నుంచి 10,50,616 యూనిట్లకు తగ్గాయి. మోటర్‌సైకిళ్ల అమ్మకాలు 10,26,705 నుంచి 6,99,949 యూనిట్లకు పడిపోయాయి. స్కూటర్ల విక్రయాలు 5,02,561 యూనిట్ల నుంచి 3,06,899 యూనిట్లకు క్షీణించాయి. ఇక మొత్తం త్రిచక్ర వాహనాల అమ్మకాలు 7 శాతం క్షీణించి 24,071 యూనిట్ల నుంచి 22,471 యూనిట్లకు పరిమితమయ్యాయి. వివిధ కేటగిరీల్లో మొత్తం ఆటోమొబైల్‌ అమ్మకాలు గత నెల 12,88,759 యూనిట్లకు తగ్గాయి. గతేడాది నవంబర్‌లో ఇవి 18,89,348 యూనిట్లుగా నమోదయ్యాయి. కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ అమ్మకాలు 1,35,775 యూనిట్ల నుంచి 1,09,726 యూనిట్లకు పడిపోయాయి. అలాగే హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా విక్రయాలు 48,800 నుంచి 37,001 యూనిట్లకు క్షీణించాయి. 

7 ఏళ్ల కనిష్టానికి పీవీ విక్రయాలు.. 
‘అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల కొరత కారణంగా పరిశ్రమ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోంది. పండుగ సీజన్‌లో కొంతయినా కోలుకోవచ్చని ఆశించింది కానీ ఈ ఏడాది నవంబర్‌లో ప్యాసింజర్‌ వాహన విక్రయాలు ఏకంగా ఏడేళ్ల కనిష్టానికి పడిపోయాయి. ద్విచక్ర వాహనాల విక్రయాలు 11 ఏళ్లు, త్రిచక్ర వాహనాల అమ్మకాలు 19 ఏళ్ల కనిష్టాలకు క్షీణించాయి‘ అని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజేశ్‌ మీనన్‌ తెలిపారు. కొత్త కోవిడ్‌ వేరియంట్‌ ఒమిక్రాన్‌ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఉద్యోగుల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇస్తూనే, సరఫరా వ్యవస్థపరమైన సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.   

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌