amp pages | Sakshi

చిట్టి పావురాల్లో కృత్రిమమేధ..!

Published on Fri, 12/15/2023 - 15:43

పావురాలు సహజంగానే తెలివైనవి. శిక్షణ ఇస్తే ఏదైనా నేర్చుకుంటాయి. అందుకే పాతకాలంలో వీటిని సమాచారం చేరవేయడానికి ఉపయోగించేవారు. అయితే మనం ఊహించినదానికన్నా ఇవి ఎంతో తెలివైనవనీ.. శిక్షణ ఇస్తే కృత్రిమ మేధలానే ఏ విషయాన్నయినా నేర్చుకుంటాయనీ ఒహియో స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు.

కృత్రిమ మేధలాగే పావురాలు కొన్ని సమస్యలను పరిష్కరిస్తాయని అధ్యయనంలో తేలినట్లు చెప్పారు. మానవులకు ఇబ్బంది కలిగించే కష్టమైన పనులను పరిష్కరించడానికి వీటిని ఉపయోగించేలా పరిశోధనలు జరగాలని తెలిపారు. సెలెక్టివ్ అటెన్షన్, స్పష్టమైన నియమాలను అనుసరించడంలో పావురాలు దిట్ట అని తేలింది. ఏఐ మోడల్‌ల్లో సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించే ‘బ్రూట్ ఫోర్స్’ పద్ధతిని పావురాలు పాటిస్తున్నట్లు పరిశోధకులు చెప్పారు. 

కృత్రిమ మేధతో పనిచేసే కంప్యూటర్‌, పావురం రెండూ కూడా ఒకే రకమైన పద్ధతిలో నేర్చుకుంటున్నాయని వాళ్ల పరిశీలనలో వెల్లడైంది. ఇందుకోసం వీళ్లు సుమారు 24 రకాల పావురాలను ఎంపికచేసి వాటికి రకరకాల ఆకారాలూ, వలయాల్లాంటి వాటిల్లోంచి వెళ్లి బటన్‌ను ప్రెస్‌ చేయడం... వంటి టాస్క్‌లను ఇచ్చారట. వాటికిచ్చిన పరీక్షలో విజయం సాధిస్తే బహుమతిగా ఆహారాన్ని అందించారు. ఇలా ట్రయల్‌ అండ్‌ ఎర్రర్‌ పద్ధతిలో రకరకాల పరీక్షలు నిర్వహించగా అవి చాలా త్వరగా ఆ పనులు నేర్చుకుని టార్గెట్‌ను చేరుకున్నాయి.

ఇదీ చదవండి: డిసెంబర్‌ 20న మొబైల్‌ ఫోన్లు స్విచ్‌ఆఫ్‌.. ఎందుకంటే..

అంతేకాదు, కొన్ని విషయాల్ని అవి మనిషికన్నా సమర్థంగా నేర్చుకోగలిగాయట. పైగా అవి నేర్చుకునే విధానం కూడా కృత్రిమ మేధను పోలి ఉందనీ, కాబట్టి పావురం న్యూరోబయాలజీని అధ్యయనం చేస్తే కృత్రిమమేధను మరింత సమర్థంగా అభివృద్ధి చేయగలమనీ చెబుతున్నారు. లెక్కించడం నుంచి రొమ్ముక్యాన్సర్‌ను గుర్తించడం వరకూ పావురాలు అన్ని పనులూ చేయగలవని పరిశోధకులు తెలిపారు.

Videos

విశాఖకే జై కొట్టిన టిడిపి

Watch Live: కర్నూలులో సీఎం జగన్ ప్రచార సభ

అంతా మాయ..సేమ్ 2 సేమ్.. 2024 మోదీ ఎన్నికల స్పీచ్ పై డిబేట్

కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం

ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం

పచ్చ మద్యం స్వాధీనం..

బాబును నమ్మే ప్రసక్తే లేదు..

మహిళలపైనా పచ్చమూకల దాష్టీకం..

నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే

విజనరీ ముసుగేసుకున్న అవినీతి అనకొండ

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)