amp pages | Sakshi

ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌.. టేకాఫ్‌!

Published on Sat, 04/23/2022 - 03:38

న్యూఢిల్లీ: ప్రయాణ బీమా (ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌)కు పూర్వపు వైభవం సంతరించుకుంది. దేశీయ ప్రయాణాలపై ఆంక్షలు తొలగిపోవడానికి తోడు, అంతర్జాతీయ విమాన సర్వీసులను తెరవడం ఇందుకు అనుకూలించే అంశం. కరోనా వైరస్‌ సమసిపోవడంతో మార్చి 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించడం తెలిసిందే. దీంతో ఎక్కువ మంది అంతర్జాతీయ ప్రయాణికులు ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నారు.

ఆశ్చర్యకరం ఏమిటంటే కరోనా ముందు నాటితో పోలిస్తే ఇప్పుడు మరింత మంది ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునేందుకు మొగ్గుచూపిస్తున్నారు. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని వారి వైఖరిలో మార్పువచ్చినట్టు భావించొచ్చు. కరోనా వల్ల రెండేళ్లుగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోవడం గమనార్హం. దీంతో విదేశీ  పర్యటనలు నిలిచిపోయాయి. ఈ ప్రభావం ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ విభాగాన్ని గట్టిగానే తాకింది.  

25% అధికం: ఆన్‌లైన్‌ ఇన్సూరెన్స్‌ ప్లాట్‌ఫామ్‌ పాలసీబజార్‌ మార్చి 27తో మొదలైన వారంలో ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ కొనుగోళ్లు 25% పెరిగినట్టు (అంతకుముందు వారంతో పోలిస్తే) తెలిపింది. విక్రయాలు రానున్న రోజుల్లో మరింత పెరుగుతాయని ఈ సంస్థ అంటోంది. విమాన టికెట్‌ ధరల స్థిరీకరణకు తోడు, సెలవులు పరిశ్రమకు కలిసొస్తాయని పేర్కొంది. ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ 35 శాతానికి చేరుకుంటాయని బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ అంచనా వేస్తోంది.

కరోనా మహమ్మారి రావడానికి ముందు ఇది 18%గా ఉండేది. విహార యాత్రలు, వ్యాపార యాత్రలకు వెళ్లే వారి నుంచి ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌కు డిమాండ్‌ పెరిగినట్టు ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ అంటోంది. చాలా కాలంగా విమాన సర్వీసులు నిలిచిపోయినందున విహార యాత్రలకు డిమాండ్‌ ఏర్పడినట్టు తెలిపింది. విదేశీ పర్యటనలకు సంబంధించి ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ బుకింగ్‌లు ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో 40 శాతం పెరిగినట్టు పాలసీబజార్‌ వెల్లడించింది.

డిమాండ్‌ మరింత పెరుగుతుంది..
‘‘ఈ డిమాండ్‌ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ 1.5 రెట్లు వృద్ధిని చూస్తుంది’’అని బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ వెబ్‌సేల్స్‌ హెడ్‌ సౌరభ్‌ చటర్జీ చెప్పారు. ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుంటే.. విమాన సర్వీసు రద్దయినా, ఆలస్యం అయినా, ఆరోగ్య సమస్యలు ఏర్పడినా కవరేజీ లభిస్తుందని పాలసీబజార్‌ ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ అమిత్‌ చాబ్రా తెలిపారు. ‘‘విదేశాలు ఇప్పుడే పర్యాటకులను అనుమతిస్తున్నాయి.  ప్రయాణానికి ముందే ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని తీసుకోవాలి. అప్పుడు రిస్క్‌ను ఎదుర్కోవడం సులభంగా ఉంటుంది’’ అని అన్నారు.

Videos

ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్

అవినాష్ రెడ్డి జీవితం నాశనం చెయ్యాలని..సీఎం జగన్ పచ్చ బ్యాచ్ కు మాస్ వార్నింగ్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

చంద్రబాబుకు దమ్ముంటే మోడీతో 4% రిజర్వేషన్ రద్దు చేయను అని చెప్పించే దమ్ము ఉందా?

స్పీచ్ మధ్యలో ఆపేసిన సీఎం జగన్ ఎందుకో తెలుసా...?

మరో 3 రోజులో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా

రామోజీ రావుకు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే

ఉప్పోగిన ప్రజాభిమానం కిక్కిరిసిన కడప

సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప

Photos

+5

తాగుడుకు బానిసైన హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)