amp pages | Sakshi

పోస్టల్ ఖాతాదారులకు అలర్ట్.. ఆ పథకాలను ఖాతాతో లింకు చేశారా?

Published on Mon, 03/07/2022 - 21:16

చిన్న మొత్తాల్లో పొదుపు చేసే వారికి పోస్ట్ ఆఫీస్ తీసుకొచ్చే పొదుపు పథకాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ముఖ్యంగా మంత్లీ ఇన్కమ్ స్కీమ్, ఎస్‌సిఎస్ఎస్, టైమ్ డిపాజిట్ వంటి పొదుపు ఖాతాలలో చాలా మంది పొదుపు చేశారు. ఈ పథకాల ద్వారా చాలా మందికి నెలవారీ, త్రైమాసిక, వార్షికానికి ఒకసారి వడ్డీ లభిస్తుంది. అయితే, వడ్డీని నగదు రూపంలో విత్ డ్రా చేసుకుంటున్నారని గుర్తించిన పోస్టల్ శాఖ ఇటీవల ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం.. 01.04.2022 నుంచి అలా నగదు రూపంలో పొదుపు పథకాల వడ్డీని నగదు రూపంలో విత్ డ్రా చేయలేరు అని పేర్కొంది.

పోస్టల్ డిపార్ట్ మెంట్ జారీచేసిన తాజా సర్క్యులర్ ప్రకారం.." ఎమ్ఐఎస్/ఎస్‌సిఎస్ఎస్/టీడీ ఖాతాల ద్వారా లభించే వడ్డీని 01.04.2022 నుంచి అకౌంట్ హోల్డర్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ లేదా బ్యాంక్ ఖాతాలో మాత్రమే క్రెడిట్ చేయనున్నారు. ఒకవేళ ఖాతాదారుడు తన పొదువు ఖాతాను ఎమ్ఐఎస్/ఎస్‌సిఎస్ఎస్/టీడీ ఖాతాలతో 31.03.2022 వరకు లింక్ చేయకపోతే ఎమ్ఐఎస్/ఎస్‌సిఎస్ఎస్/టీడీ సండ్రీ ఆఫీసు ఖాతాల్లో వడ్డీ క్రెడిట్ చేయనున్నట్లు తెలిపింది. అలా బకాయి వడ్డీని పోస్ట్ఆఫీస్ సేవింగ్స్ ఖాతా లేదా చెక్ ద్వారా మాత్రమే చెల్లించనున్నారు. 01.04.2022 నుంచి ఎమ్ఐఎస్/ఎస్‌సిఎస్ఎస్/టీడీ సండ్రీ ఆఫీసు అకౌంట్ నుంచి వడ్డీని క్యాష్ రూపంలో చెల్లించరు" అని తెలిపింది.

సేవింగ్స్ ఖాతాకు లింక్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:

  • ఎమ్ఐఎస్/ఎస్‌సిఎస్ఎస్/టీడీ నుంచి లభించే వడ్డీ పొదుపు ఖాతాలో జమ అయినట్లు అయితే, మీకు అదనంగా వడ్డీ లభిస్తుంది. 
  • డిపాజిటర్లు పోస్టాఫీసును సందర్శించాల్సిన పని లేకుండా ఆన్లైన్ ద్వారా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. 
  • ఎమ్ఐఎస్/ఎస్‌సిఎస్ఎస్/టీడీ వడ్డీ కోసం ప్రతిసారీ విత్ డ్రా ఫారాలను నింపాల్సిన అవసరం లేదు.
  • డిపాజిటర్లు ఎమ్ఐఎస్/ఎస్‌సిఎస్ఎస్/టీడీ ఖాతాల లభించే వడ్డీని పివో సేవింగ్స్ అకౌంట్ నుంచి రికరింగ్ డిపాజీట్ ఖాతాలకు ఆటోమేటిక్ క్రెడిట్ అయ్యే సౌకర్యాన్ని పొందవచ్చు. 

(చదవండి: యాపిల్ తిక్క కుదిరింది.. ఐఫోన్‌కు దీటుగా రష్యా కొత్త ఫోన్..!) 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)