amp pages | Sakshi

‘కన్న కూతుర్ని కొట్టడానికి ఆయనకు చేతులెలా వచ్చాయో’, అంబానీలే లేకపోతే

Published on Wed, 11/22/2023 - 13:54

రేమండ్‌ ఛైర్మన్‌, ఎండీ గౌతమ్‌ సింఘానియాపై ఆయన భార్య నవాజ్‌ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త గౌతమ్‌ సింఘానియా నుంచి విడిపోవడానికి దారితీసిన పరిస్థితులు, కుమార్తె నిహారికపై గౌతమ్‌ శారీరక దాడి, తమని రక్షించేందుకు అంబానీ సాయం చేసిన అంబానీ సోదరుల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

‘‘సెప్టెంబర్‌ 10 న ముంబైలోని తన ఇంట్లో గౌతమ్‌ సింఘానియా పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ వేడుకల తర్వాత సింఘానియా దాదాపూ 15 నిమిషాల పాటు కూతురు, భార్య కనికరం లేకుండా నాపై , నా కుమార్తె నిహారికను కొట్టాడు. పిడిగుద్దులు గుద్దాడు. ఆ తర్వాత అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. మారణాయుధాలు తీసుకుని వస్తాడని అనుకున్నాను. వెంటనే నా కూతుర్ని రక్షించుకునేందుకు ఇంట్లోని ఓ రూంలో దాచిపెట్టాను. 

రక్షించమని పోలీసులకు ఫోన్‌ చేశా. నా స్నేహితురాలు అనన్య గోయెంకాను ఫోన్‌ చేసి పరిస్థితి వివరించా. ఆమె వచ్చి పోలీసులు రావడం లేదని నిర్ధారించింది. గౌతమ్‌ సింఘానియా పోలీసులు రాకుండా అడ్డుకుంటున్నారని తెలిసింది. ఏం చేయాలో పాలు పోక ఆ సమయంలోనే నీతా అంబానీ, అనంత్ అంబానీలకు ఫోన్‌ చేశా. అంబానీ కుటుంబం రంగంలోకి దిగింది. పోలీసులు చర్యలు తీసుకునేలా ఫిర్యాదు చేశారు. వాళ్లు లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో ’’ అంటూ ఇంటర్వ్యూలో వెల్లడించారు.   

నవాజ్‌ మోడీ ఆరోపణలపై ఆమె భర్త గౌతమ్ సింఘానియా స్పందించారు. ‘నా కుటుంబ గౌరవాన్ని కాపాడుకుంటూ ఇద్దరు కుమార్తెల కోసం ఎటువంటి ప్రకటనలు చేయకూడదని, గోప్యంగా ఉండాలని అనుకుంటున్నట్లు చెప్పారు.  

గౌతమ్‌ సింఘానియా, నవాజ్‌మోడీ సింఘానియా విడాకులు
 58 ఏళ్ల గౌతమ్ సింఘానియా 1999లో న్యాయవాది నాడార్ మోడీ కుమార్తె నవాజ్ మోడీని వివాహం చేసుకున్నారు. ఈ నవంబర్ 13న సింఘానియా తమ 24 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకున్నట్లు వెల్లడించారు. అయితే విడాకుల విషయంలో నవాజ్‌ మోడీ ఓ షరతు విధించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు  కుమార్తెలు నిహారిక, నిషా, తన కోసం నవాజ్ మోడీ సింఘానియా భర్తకు గౌతమ్‌ సింఘానియాకు చెందిన మొత్తం రూ.11,620 కోట్ల విలువైన ఆస్తిలో 75 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

ట్రస్ట్‌ని ఏర్పాటు చేసేలా
గౌతమ్‌ సైతం భార్య నవాజ్‌ మోడీ అడిగిన మొత్తం ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఈ మెుత్తాన్ని బదిలీ చేసేందుకు కుటుంబ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే గౌతమ్ సింఘానియా తన మరణానంతరం తర్వాత భార్య నవాజ్‌కు ఆమోదయోగ్యం కాని ఆస్తిని తన కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి అనుమతించాలని కోరినట్లు కూడా నివేదిక హైలెట్‌ చేసింది. 

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)