amp pages | Sakshi

గూగుల్ ఇంటర్వ్యూలో నెగ్గాడు.. కానీ అక్కడ మాత్రం!

Published on Sat, 03/25/2023 - 15:34

కోవిడ్‌-19 తర్వాత మెట్రో పాలిటన్‌ నగరాల్లో అద్దె ఇల్లు సంపాదించడం తలకు మించిన భారంగా మారింది. ఎంతలా అంటే? గూగుల్‌ లాంటి టెక్‌ దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగం సంపాదించొచ్చు..కానీ బెంగళూరు వంటి మెట్రో పాలిటన్‌ నగరాల్లో అద్దె ఇల్లు దొరకడం చాలా కష్టంగా ఉందంటూ అద్దెకోసం అన్వేషిస్తున్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల బెంగళూరులో ఇంటి యజమానుల ఆగడాల గురించి ఐటీ ఉద్యోగులు సోషల్‌ మీడియాకు ఎక్కిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఇంటి యజమానులు పెట్టే సవాలక్ష కండీషన్లకు ఒప్పుకోవాలి. ఇంటర్వ్యూ పేరుతో వాళ్లు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. లేదంటే అద్దె ఇల్లు దొరకదు. అలా అద్దె ఇల్లు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొన్న రీపు సోనారిక భడోరియా (Ripu Daman Bhadoria) తనకు ఎదురైన చేదు అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నారు.

భడోరియా గత ఏడాది అమెరికా సియాటెల్ నుంచి బెంగళూరు వచ్చాడు. అక్కడ తన బడ్జెట్‌ తగ్గట్లు రెంట్‌కు ఉండేందుకు అద్దె ఇల్లు కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. కానీ కోవిడ్‌ తర్వాత అద్దె ఇళ్లకు గిరాకీ పెరిగింది. దీన్ని క్యాష్‌ చేసుకునేందుకు ఇంటి ఓనర్స్‌ రకరకాల ప్రశ్నలతో ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. లేదంటే అద్దె ఇల్లు దొరకడం చాలా కష్టం. అలా ఓనర్‌ చేసిన తొలి ఇంటర్వ్యూలో ఫెయిల్‌ అయినట్లు బహదోరియా చెప్పుకొచ్చాడు. 

అప్పుడే  బెంగళూరులో అద్దె ఇల్లును సొంతం చేసుకోవడం కంటే గూగుల్‌ (google) ఇంటర్వ్యూని క్రాక్‌ చేయడం చాలా సులభమని భావించినట్లు చెప్పాడు. ఆ తర్వాత ఓ చిన్న చిట్కాతో మరో ఇంటి ఓనర్‌ చేసిన ఇంటర్వ్యూలో పాస్‌ అయినట్లు వివరించాడు. 

బహదోరియా గూగుల్‌ ఉద్యోగి. తాను గూగుల్‌ ఉద్యోగినని. సొంత ఇల్లు కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉన్నానని చెప్పడం వల్లే తనకు అద్దె ఇల్లు దొరికిందని చెప్పాడు. గూగుల్‌లో పనిచేయడం విపత్కర పరిస్థితులు తనకు అనుకూలంగా మారతాయని ఎప్పుడూ ఊహించలేదని లింక్డ్‌ ఇన్‌ పోస్ట్‌లో రాశారు. ఆ పోస్ట్‌కు స్పందించిన నెటిజన్లు తమకు ఎదురైన చేదు అనుభవాల్ని గుర్తు చేసుకున్నారు.  
  
విసుగు తెప్పించడంలో 
బెంగళూరులో ఇంటి ఓనర్స్‌ అద్దె ఇంటి కోసం వెతికే వారికి తెగ విసుగు తెప్పిస్తుంటారనే అభిప్రాయం వ్యక్తం చేశాడు ఓ నెటిజన్‌ . 2016 లో అనుకుంటా. మీరు పొట్టి స్కర్టులు ధరిస్తారా? మీ ఇంటికి మగ స్నేహితులు వస్తారా? అని ప్రశ్నించారు. నేను టీసీఎస్‌లో  పనిచేస్తున్నాను కాబట్టి నాకు అద్దె ఇల్లు దొరికింది. వేరే కంపెనీలో ఉన్న నా స్నేహితుడికి ఉండేందుకు  2 నెలలు పాటు అద్దె ఇల్లు దొరకలేదు. అప్పటి నుంచి బెంగళూరుకు దూరంగా ఉంటున్నా' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

చదవండి👉 హీరా గోల్డ్‌ కుంభకోణం..రూ.33.06 కోట్ల నౌహీరా షేక్​ ఆస్తుల అటాచ్‌

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌