amp pages | Sakshi

రూ.10వేల పెట్టుబడితో.. 15 కోట్లు సంపాదన, ఎలా అంటే?

Published on Fri, 12/15/2023 - 13:59

నెలకు 10వేలు 25ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే సుమారు 15 కోట్ల వరకు డబ్బు సంపాదించడం ఎలా? ఈ రహస్యాన్నే హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ఎండీ, యాంఫీ ఛైర్మన్‌ నవనీత్ మునోత్‌ బహిర్ఘతం చేశారు.  

ముంబైలో జరిగిన బిజినెస్ టుడే 500 వెల్త్ క్రియేటర్ సమ్మిట్‌లో భారతీయ మార్కెట్ల భవిష్యత్తు గురించి, వ్యాపారాలు, పెట్టుబడిదారులు, కొత్తగా పుట్టుకొస్తున్న మార్కెట్‌ ట్రెండ్‌లు, సవాళ్లు, అవకాశాల్ని అన్వేషించడం అనే అంశంపై ఆయా కంపెనీల సీఈఓలు మాట్లాడారు. 

ఈ సందర్భంగా హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ఎండీ, యాంఫీ ఛైర్మన్‌ నవనీత్ మునోత్‌ మాట్లాడుతూ..మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్‌ విలువ 17 వేల కోట్లు మూడేళ్ళ క్రితం అది నేటితో పోలిస్తే సగం. మ్యూచువల్‌ ఫండ్‌ మార్కెట్‌ విలువ బిలియన్ డాలర్లకు చేరుకోవడానికి దాదాపు 25 ఏళ్లు పట్టింది. 2017లో 4,000 కోట్లు, 2018లో 8,000 కోట్లు, ఇప్పుడు 2023లో 17,000 కోట్లుగా ఉందని అన్నారు.  

అనంతరం.. ఇప్పటి వరకు మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులతో భారీ రాబడులే వచ్చాయి. ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌లో నెలకు రూ.10వేల చొప్పున 25 నుంచి 30 ఏళ్లు పెట్టుబడులు పెడితే 18-19 శాతం వడ్డీ ఇలా అసలు వడ్డీ మొత్తం కలుపుకుని రూ.15 కోట్లు వచ్చాయి. 

అయితే, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పరంగా అంత సానుకూలత లేదు. కాబట్టి రాబోయే 28 సంవత్సరాలలో రూ.10వేలు పెట్టుబడి పెడితే ఇంత భారీ మొత్తంలో డబ్బుల్ని సంపాదించవచ్చా’ అంటే ఖచ్చితంగా చెప్పలేను అని అన్నారు. అయితే ఇది దేశ సామర్ధ్యం ఎలా ఉందో నిరూపిస్తుంది. పెట్టుబడుల పరంగా భారత్‌ మాత్రమే కాదు ప్రపంచ దేశాల్లో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు అత్యుత్తమం అంటూ నవనీత్ మునోత్‌ తన ప్రసంగాన్ని ముగించారు.

Videos

ఒకసారి తిరిగి చూసుకోండి..

బాబు కుట్రలు: సంక్షేమ పథకాల అమలును చంద్రబాబు అడ్డుకుంటున్నారు: అవంతి

చంద్రబాబు నడిచొస్తే ఒక కుట్ర.. నిలబడితే భూకంపం.. కన్నబాబు సెటైర్లు

చంద్రబాబుపై విద్యార్థుల కామెంట్స్

30 వేల కోట్ల ఆరోపణలపై పెద్దిరెడ్డి క్లారిటీ..!

జగన్ ప్రచార సభలో ఊహించని రెస్పాన్స్

చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలపై బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..!

పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుపుపై చిరంజీవి వీడియో..కొమ్మినేని స్ట్రాంగ్ రియాక్షన్

ఏపీ రాజధానిపై ఈనాడు తప్పుడు ప్రచారం ... కొమ్మినేని అదిరిపోయే కౌంటర్..

అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?