amp pages | Sakshi

శాంసంగ్‌ గుడ్‌ న్యూస్‌: భారీ ఉద్యోగాలు

Published on Wed, 11/30/2022 - 16:58

సాక్షి,ముంబై: దక్షిణకొరియా దిగ్గజం శాంసంగ్‌ ఇండియా శుభవార్త అందించింది.టాప్‌ కంపెనీల్లో లక్షల కొద్దీ ఉద్యోగాలు కోల్పోతున్న సమయంలో  శాంసంగ్‌ ఇండియా ఉద్యోగ నియామకాలను ప్రకటించి ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు భారీ ఊరట  నిచ్చింది. దాదాపు వెయ్యి మంది ఇంజనీర్లను నియమించుకోనుంది. (ఎన్డీటీవీ: ప్రణయ్ రాయ్, రాధిక గుడ్‌బై, కేటీఆర్‌ ఏం చేశారంటే?)

కంప్యూటర్ సైన్స్, అనుబంధ శాఖలు (AI/ML/కంప్యూటర్ విజన్/VLSI), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎంబెడెడ్ సిస్టమ్స్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లలో ఇంజనీర్లను రిక్రూట్ చేయనున్నట్లు శాంసంగ్‌ వెల్లడించింది. భారతదేశ కేంద్రీకృత ఆవిష్కరణలతో సహా, ప్రజల జీవితాలను సుసంపన్నం చేసే ఆవిష్కరణలు, సాంకేతికతలు, ఉత్పత్తుల, డిజైన్‌లపై వీరు పనిచేస్తారని, డిజిటల్ ఇండియాను శక్తివంతం చేయాలనే తమ విజన్‌ను మరింత మెరుగుపరుస్తుందని శాంసంగ్ ఇండియా హ్యూమన్ రిసోర్సెస్ హెడ్ సమీర్ వాధావన్ అన్నారు.

బెంగళూరు, నోయిడా, ఢిల్లీ, బెంగళూరులోని రీసెర్చ్‌, అండ్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాల కోసం సుమారు 1000 మందిని నియమించుకోనుంది.  దీనికి అదనంగా మేథ్స్‌,  కంప్యూటింగ్ లేదా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను నియమించుకుంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), కనెక్టివిటీ, క్లౌడ్, బిగ్ డేటా, బిజినెస్ ఇంటెలిజెన్స్, ప్రిడిక్టివ్ అనాలిసిస్, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, సిస్టమ్ ఆన్‌లో పనిచేసేలా ఈ ఇంజనీర్లను 2023లో కంపెనీలో చేర్చుకుంటామని శాంసంగ్‌ తెలిపింది. 

పరిశోధనా కేంద్రాలు మల్టీ-కెమెరా సొల్యూషన్‌లు, టెలివిజన్‌లు, డిజిటల్ అప్లికేషన్‌లు, 5G, 6G  అల్ట్రా-వైడ్‌బ్యాండ్ వైర్‌లెస్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ లాంటి రంగాలలో 7,500కి పైగా పేటెంట్‌లను దాఖలు చేశాయి. ఈ పేటెంట్లలో చాలా వరకు శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు,డిజిటల్ అప్లికేషన్‌లున్నాయి. అలాగే ఇండియాలో తయారైన ఆవిష్కరణలతో నంబర్‌  పేటెంట్ ఫైలర్‌గా నిలిచిందినీ,  నేషనల్ IP అవార్డు 2021, 2022ని కూడా గెలుచుకుందని  కంపెనీ తెలిపింది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)