amp pages | Sakshi

ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ కొనేవారికి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్‌!

Published on Fri, 09/03/2021 - 15:38

హైదరాబాద్: ఏటా లక్షల్లో పెరుగుతున్న వాహనాలు.. పరిమిత సంఖ్యలో పెట్రోల్, డీజిల్‌ వనరులు.. దీనికి తోడు విజృంభిస్తున్న వాహన కాలుష్యం.. వీటన్నింటికీ చెక్‌ పెట్టేందుకు కనిపిస్తున్న ప్రత్యామ్నాయం.. విద్యుత్‌ వాహనాలు. అందుకే ప్రపంచం మొత్తం ప్రస్తుతం విద్యుత్‌ వాహన(ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌-ఈవీ) తయారీ రంగంపై దృష్టి సారిస్తోంది. (చదవండి: ఐటీ ‘రిటర్న్స్‌’ విషయంలో జర జాగ్రత్త..!)

తెలంగాణ రాష్ట్రాన్ని విద్యుత్‌ వాహనాలు, ఎనర్జీ స్టోరేజీ వ్యవస్థకు కేంద్ర బిందువుగా మార్చేందుకు ప్రభుత్వం ‘తెలంగాణ ఎలక్ట్రిక్‌ వెహికల్, ఎనర్జీ స్టోరేజీ పాలసీ 2020–2030’ని రూపొందించింది. గత ఏడాది ఈ పాలసీని  తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. ఈవీ రంగంలో పెట్టుబడుల ఆకర్షణ, పరిశోధన, అభివృద్ధి, తయారీకి ప్రోత్సాహం, వ్యక్తిగత, వాణిజ్య రంగాల్లో రవాణా ఖర్చు తగ్గింపు, ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పదేళ్ల పాటు కొత్త పాలసీ పనిచేస్తుంది. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలను కొన్న వారికి ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది.

నూతన విధానంలోని ముఖ్యాంశాల్లో కొన్ని.. 

  • తొలి విడతలో తయారయ్యే రెండు లక్షల ద్విచక్ర వాహనాలు, 30 వేల ఆటో రిక్షాలు, 5వేల కార్లు (టాక్సీలు, క్యాబ్‌లు తదితరాలు), 500 ఎలక్ట్రిక్‌ బస్సులకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్‌ చార్జీ వంద శాతం ఉచితం.
  • వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే విద్యుత్‌ వాహనాల కొనుగోలుకు స్వయం ఉపాధి పథకాల కింద ఆర్థిక సాయం. 
  • విద్యుత్‌ ట్రాక్టర్లకు రవాణా శాఖ నిబంధనలకు లోబడి వంద శాతం రోడ్‌ టాక్స్, రిజిస్ట్రేషన్‌ ఫీజు నుంచి మినహాయింపు.
  • నగరం నలుమూలల నుంచి హైదరాబాద్‌ మెట్రో స్టేషన్లకు బ్యాటరీ ఆధారిత వాహనాలు నడపడం. 
  • ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో దశల వారీ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు. వీటికి విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ ప్రత్యేక టారిఫ్‌ వసూలు చేస్తుంది. 
  • చార్జింగ్‌ స్టేషన్లు ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయాన్ని టీఎస్‌ రెడ్కో మదింపు చేస్తుంది. అవసరమైన విద్యుత్‌ సరఫరాపై డిస్కమ్‌లతో సమన్వయం చేస్తుంది.  
  • వేయికి పైగా కుటుంబాలు కలిగిన టౌన్‌షిప్‌లు చార్జింగ్‌ స్టేషన్‌ లాట్లు ఏర్పాటుకు ప్రోత్సాహం. 
  • ప్రతీ 50 కిలోమీటర్లకు ఒక చార్జింగ్‌ స్టేషన్, పార్కింగ్‌ జోన్‌ ఏర్పాటు. ప్రజా రవాణా రంగంలో ఎలక్ట్రిక్‌ వాహన వినియోగానికి ప్రోత్సహించడం.
  • విద్యుత్‌ వాహనాలు, సంబంధిత పరికరాలు తయారు చేసే కంపెనీలకు ప్రోత్సాహకాలు. రూ.200 కోట్ల పెట్టుబడి, వేయి మందికి ఉపాధి కల్పించే మెగా కంపెనీలకు 20శాతం పెట్టుబడి రాయితీ. ఏడేళ్ల పాటు ఏడాదికి రూ.5 కోట్ల చొప్పున ఎస్‌జీఎస్‌టీ రీయింబర్స్‌మెంట్, ఐదేళ్ల పాటు గరిష్ఠ పరిమితి రూ.5 కోట్లు మించకుండా 25శాతం విద్యుత్‌ రాయితీ, ఐదేళ్ల పాటు విద్యుత్‌ సుంకం, స్టాంప్‌ డ్యూటీపై వంద శాతం రాయితీ.  
  • ప్రత్యేక మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్లు, ఈవీ తయారీ పారిశ్రామికవాడల్లో మౌలిక వసతులు కల్పిస్తారు. ప్రభుత్వ శాఖల ద్వారా ఈవీల కొనుగోలు, పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు, టీ వర్క్స్‌లో ప్రత్యేక ప్రోటోటైపింగ్‌ విభాగం ఏర్పాటు వంటివి నూతన పాలసీలో ఉన్నాయి.

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)