amp pages | Sakshi

వాట్సాప్‌ను వెనక్కి నెట్టేసిన టెలిగ్రాం

Published on Mon, 02/08/2021 - 18:01

2021లో వాట్సాప్‌కు ఏ విదంగాను కలిసి రావడం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో కొత్త ప్రైవసీ పాలసీ నిబంధనలు తీసుకువచ్చి చిక్కుల్లో పడింది. ఆప్పటి నుంచి ఎన్ని కొత్త ప్రయత్నాలు చేసిన యూజర్లను ఆకట్టుకోవడంలో విఫలమవుతుంది. దీని ప్రధాన ప్రత్యర్థులైన టెలిగ్రాం, సిగ్నల్ యాప్ లు మాత్రం దూసుకెళ్తున్నాయి. 2021 జనవరిలో అత్యధికంగా డౌన్‌లోడ్‌ చేసిన నాన్-గేమింగ్ యాప్స్‌లో టెలిగ్రాం అన్నిటికంటే ముందంజలో ఉంది. ఈ విషయాన్నీ సెన్సార్ టవర్ అనే డేటా సంస్థ వెల్లడించింది.

టెలిగ్రాంను ఎక్కువ శాతం డౌన్‌లోడ్ చేసిన‌ వారిలో 24 శాతం మంది భారతీయులు ఉన్నారు. ఈ మెసేజింగ్ యాప్ ను గత నెలలో ప్రపంచవ్యాప్తంగా 6.3కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. దీనిలో భారతదేశం నుంచే 1.5 కోట్ల మంది టెలిగ్రామ్ ను డౌన్‌లోడ్ చేశారు. టెలిగ్రాంను 2020 జనవరిలో డౌన్‌లోడ్ చేసుకున్న దానికంటే 3.8 రెట్లు ఎక్కువగా ఈసారి డౌన్‌లోడ్ చేసుకున్నారు. డౌన్‌లోడ్‌లలో ఆకస్మిక పెరుగుదల ప్రధాన కారణం వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ నిబంధనలు అనే చెప్పుకోవాలి. వాట్సాప్ కొత్త విధానాలు వినియోగదారులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. దింతో చాలా మంది టెలిగ్రామ్‌కు మారారు. 

2వ స్థానంలో టిక్‌టాక్
ఇక డౌన్‌లోడ్‌ పరంగా టిక్‌టాక్ రెండవ స్థానంలో ఉండగా తర్వాత స్థానాలలో సిగ్నల్, ఫేస్‌బుక్ ఉన్నాయి. వాట్సాప్ మునుపటితో పీలిస్తే జనవరిలో మూడవ స్థానం నుంచి ఐదవ స్థానానికి పడిపోయింది. "టాప్ యాప్స్ వరల్డ్ వైడ్ ఫర్ జనవరి 2021 బై డౌన్లోడ్స్" అనే శీర్షికతో ప్రచురించిన కథనంలో సెన్సార్ టవర్ ఈ విషయాన్ని తెలిపింది. టెలిగ్రాం డౌన్‌లోడ్లలో 24 శాతంతో భారత్ ప్రథమ స్థానంలో ఉండగా, 10 శాతం డౌన్‌లోడ్‌లతో ఇండోనేషియా రెండవ స్థానంలో ఉంది. మనదేశంలో టిక్‌టాక్ ను బ్యాన్ చేసినప్పటికీ కూడా ప్రపంచ వ్యాప్తంగా డౌన్‌లోడ్ సంఖ్య 6.2కోట్లకు చేరుకుంది. దీనిలో 17 శాతం చైనా నుంచి కాగా 10శాతం మంది అమెరికా నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

చదవండి: లీకైన వన్‌ప్లస్ 9ప్రో ఫోటోలు
              గెలాక్సీ ఎఫ్62 లాంచ్ తేదీ వచ్చేసింది!

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌