amp pages | Sakshi

Tesla: భారత్‌లో ఆన్‌లైన్‌ ద్వారా కార్ల అమ్మకం!

Published on Tue, 09/07/2021 - 14:53

ఆటోమొబైల్‌ రంగంలో భారీ బిజినెస్‌ జరిపే భారత్‌లో.. ఎలక్ట్రిక్ కార్ల లాంఛింగ్‌ ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది టెస్లా. ఈ ఏడాది చివరికల్లా ప్రతిపాదించిన నాలుగు మోడల్స్‌లో ఒకటి ఖరారై.. లాంఛ్‌ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాయితీల విషయంలో చర్చలు కొనసాగుతుండగానే.. మరోవైపు కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి టెస్లా ప్రతినిధులు వివరణలు ఇస్తున్నారు.
 

ఈ క్రమంలో ఫిజికల్‌ రిటైల్‌ షోరూమ్స్‌ను సొంతగా నిర్వహించేందుకు టెస్లా ఉవ్విళ్లూరుతోంది. డీలర్‌ నెట్‌వర్క్‌ లేకుండా నేరుగా సొంత షోరూమ్స్‌ ద్వారా కార్ల అమ్మకాలు చేపట్టనున్నట్లు కేంద్రానికి స్పష్టం చేసింది. అంతేకాదు ఆన్‌లైన్‌లోనూ కార్ల అమ్మకాల్ని చేపట్టాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే అమెరికాలో మాత్రమే ఆన్‌లైన్‌ సేల్‌ చేస్తోంది. అయితే ఇప్పటికే జర్మనీతో పాటు మరికొన్ని దేశాల్లోనూ అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. ఒకవేళ అవి ఆలస్యం అయితే ఆన్‌లైన్‌ సేల్స్‌ విభాగం ద్వారా టెస్లా, భారత్‌లో కొత్త రికార్డు సృష్టించినట్లు అవుతుంది.   క్లిక్‌ చేయండి: టెస్లా.. భారత్‌లో రాబోతున్నవి ఇవేనా?

ఇక విదేశీ కంపెనీలకు ఎఫ్‌డీఐ రూల్స్‌ను సవరించే అంశం కేంద్రం పరిధిలో ఉండగా.. సబ్బీడీలు, ఆ ఉత్పత్తులను స్థానిక ఉత్పత్తులుగా పరిగణించడం(ఇక్కడ అమ్మినా.. బయటి దేశాలకు అమ్మినా కూడా) లాంటి షరతులపై చర్చలు నడిపిస్తోంది. ఇప్పటికే భారత్‌లో ఐకియా ఫిజికల్‌ షోరూమ్స్‌ ఉండగా.. ఐఫోన్‌ రిటైల్‌ ఔట్‌లెట్‌ కొవిడ్‌తో ఆలస్యమవుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ముచ్చటగా మూడో విదేశీ కంపెనీగా టెస్లా రిటైల్‌ ఔట్‌లెట్‌ నిలవనుంది.

చదవండి: స్టీరింగ్‌ లేకుండా టెస్లా చీప్‌ కారు

Videos

ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు

అకాల వర్షం..అపార నష్టం

హైదరాబాద్ లో వర్ష బీభత్సం..సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ఇచ్చాపురం జనసంద్రం..

పార్టీ పెట్టి పదేళ్ళయింది..ఏం పీకావ్..పవన్ కి ముద్రగడ పంచ్

పేదల నోట్లో మట్టి కొట్టిన సైకో.. రైతులు, విద్యార్థులపై బాబు కుట్ర

"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?