amp pages | Sakshi

Toyota Tocozilla: ఇది ట్రక్కు కాదు నడిచే ఇల్లు.. అచ్చంగా హీరోల తరహాలో

Published on Thu, 11/04/2021 - 14:57

టాలీవుడ్‌ మొదలు హాలీవుడ్‌ వరకు అవుట్‌డోర్‌ షూటింగ్‌లకి వెళ్లే హీరోలు వ్యానిటీ కార్లు ఉపయోగిస్తుంటారు. అచ్చం ఇంటిలాగే బెడ్‌, డైనింగ్‌, కిచెన్‌, బాత్‌రూమ్‌ ఇలా సకల సౌక​ర్యాలు ఆ వ్యానిటీ వెహికల్‌లో ఉంటాయి. సినిమా హీరోల తరహాలో ఆ తర్వాత కొందరు రాజకీయ నాయకులు కూడా ఇలాంటి సౌకర్యం ఏర్పాటు చేసుకున్నారు. హీరోలు, పొలిటీషియన్లకే కాదు ఇప్పుడు అడ్వెంచరిస్టులు, క్యాంపర్లతో పాటు ఈ తరహా వాహనాలపై ఆసక్తి ఉన్న సామాన్యులకు  వ్యానిటీ వెహికల్‌ను అందుబాటులోకి తెస్తోంది టయోటా.

సెమా షోలో
పూర్తి ఆఫ్‌రోడ్‌ వెహికల్‌గా టయోటా సంస్థ టోకోజిల్లాను రూపొందించింది. అమెరికాలోని లాస్‌వెగాస్‌లో జరుగుతున్న సెమా షో 2021లో ఈ ట్రక్‌ను టయోటా ప్రదర్శించింది. త్వరలోనే మార్కెట్‌లోకి తెస్తామని తెలిపింది.

కదిలే ఇళ్లు
టయోటా టోకోజిల్లాలో ఇద్దరు వ్యక్తులు ఇందులో ప్రయాణించడమే కాదు ఇంటిగా మార్చుకుని బతికేందుకు అవసరమైనన్ని సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. కిచెన్‌ అందులో స్టవ్‌, సింక్‌, డిష్‌ వాషర్‌, ఫ్రిడ్జ్‌ వంటివి ఉన్నాయి. బాత్‌రూమ్‌ కమ్‌ టాయిలెట్‌, టీవీ, డైనింగ్‌ ఏరియా, రెండు సోఫాలు, ఇద్దరు వ్యక​‍్తులు పడుకునేందుకు వీలుగా స్లీపింగ్‌ ఏరియాతో పాటు సన్‌రూఫ్‌ సౌకర్యాన్ని కూడా అమర్చారు. ఈ ట్రక్కులో లివింగ్‌ ఏరియా 1.83 మీటర్ల ఎత్తుతో డిజైన్‌ చేశారు. 

క్యాంపింగ్‌కి అనుకూలం
టయోటా నుంచి 70, 80వ దశకాల్లో వచ్చిన ట్రక్‌ మోడల్‌లను అనుసరించి పూర్తి రెట్రో స్టైల్‌లో టాకోజిల్లాను తయారు చేశారు. క్యాంపింగ్‌ని ఇష్టపడే వారికి ఈ ట్రక్‌ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని టయోటా అంటోంది. వచ్చే ఏడాదిలో ఈ కారు మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ధరకు సంబంధించి టయోటా నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు.



ఇంజన్‌ సామర్థ్యం
3.5 లీటర్‌ వీ6 ఇంజన్‌తో 6 మాన్యువల్‌ గేర్‌ షిప్ట్‌ పద్దతి 4 వీల్‌ డ్రైవ్‌ మోడ్‌లో ఈ కారుని డిజైన్‌ చేశారు. ఈ కారు ఇంజన్‌ 278 హెచ్‌పీతో 6,000 ఆర్‌పీఎమ్‌ ఇవ్వగలదు.

Videos

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)