amp pages | Sakshi

ఐఫోన్‌ యూజర్లకు ఎలాన్‌ మస్క్‌ భారీ షాక్‌!

Published on Sun, 12/11/2022 - 10:34

ట్విటర్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌ ఐఫోన్‌ యూజర్లకు భారీ షాక్‌ ఇచ్చారు. డిసెంబర్‌ 12 నుంచి  ‘ట్విటర్‌ బ్లూ’ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవలను ఐఫోన్‌ యూజర్ల కు అందించేందుకు వారి వద్ద నుంచి ఎక్కువ మొత్తంలో సబ్‌ స్క్రిప్షన్‌ ఛార్జీలను వసూలు చేయనుట్లు తెలిపారు.

సోమవారం నుంచి ట్విటర్‌ సంస‍్థ బ్లూ సబ్‌ స్క్రిప్షన్‌ సర్వీసుల్ని పునప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ సేవలు వినియోగించుకునే యూజర్లు బ్లూటిక్‌తో పాటు, 1080 పిక్సెల్‌ వీడియోలు పోస్ట్‌ చేయడంతో పాటు, ట్విట్‌లను ఎడిట్‌ చేసుకోవచ్చని పేర్కొంది. తద్వారా ట్విటర్‌ 2021లో తొలిసారి ప్రారంభించిన సబ్‌స్క్రిప్షన్‌ సేవలు కంటే ఇప్పుడు తామిచ్చే సర్వీసులు అందుకు భిన్నంగా ఉంటాయని ట్విటర్‌ యాజమాన్యం స్పష్టం చేసింది.  

బాస్‌గా బాధ్యతలు చేపట్టిన ఎలాన్‌ మస్క్‌ రెండోసారి సబ్‌స్క్రిప్షన్‌ సర్వీసుల్లో కొన్ని మార్పులు చేసి రెండోసారి యూజర్లకు పరిచయం చేశారు. కానీ మస్క్‌ ఊహకు అందని విధంగా ఫేక్‌ అకౌంట్లు భారీ ఎత్తున వెలుగులోకి వచ్చాయి. దీంతో సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేశారు. సేవల్లో మార్పులు చేసి..పున ప్రారంభిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ఆ 3వ సారి ఆ సేవలు వినియోగంలోకి రానుండగా..సవరించిన సబ్‌స్క్రిప్షన్‌కు ఎంత చెల్లించాలనేది ఆ సంస్థ స్పష్టత ఇచ్చింది.



ఐఫోన్‌ యూజర్లకు అదనం
ఏదైనా సంస్థలు, లేదంటే వ్యక్తులు వాళ్లు తయారు చేసిన యాప్స్‌ను..యాపిల్‌కు చెందిన యాప్‌ స్టోర్‌లో ఉంచాలంటే ఆ సంస్థకు 30శాతం సర్వీస్‌ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. యాపిల్‌ సంస్థ సైతం నిర్వహాణ పేరుతో అన్నీ యాప్స్‌ నుంచి ఒకే తరహాలో పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలు వసూలు చేస్తుంది. కానీ ట్విటర్‌ ఆశ్చర్యంగా యూజర్ల నుంచి డైరెక్ట్‌గా యూజర్ల నుంచి 3 డాలర్లు అదనంగా వసూలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ప్రకటనతో వెబ్‌ యూజర్లకు నెలకు 8 డాలర్లు, ఐఫోన్‌ యూజర్లకు 11 డాలర్లు చెల్లించి ట్విటర్‌ అందించే సబ్‌స్క్రిప్షన్‌ సేవల్ని పొందాల్సి ఉంటుంది.

ట్విటర్‌ బ్లూ ప్రత్యేకతలు 
ట్విటర్‌ బ్లూ యూజర్లు వారి అకౌంట్లు పేర్లు, ప్రొఫైల్‌ పిక్చర్లు, ఫోటోలు మార్చుకోవచ్చు. కానీ బ్లూ కలర్‌ బ్యాడ్జ్‌ మాత్రం ట్విటర్‌ సంస్థ రీ వెరిఫికేషన్‌ చేసే వరకు పొందలేదు. అయితే ఈ రీ వెరిఫై చేసి బ్యాడ్జ్‌ను ఎప్పుడు అందిస్తుందనే అంశంపై ట్విటర్‌ స్పష్టత ఇ‍వ్వేలేదు. 

ఇక పునరుద్ధరించిన ఖాతాలో అదనంగా కొన్ని ఫీచర్లను వినియోగించుకోవచ్చని ట్విటర్‌ స్పష్టం చేసింది. ముఖ్యంగా ట్విటర్‌ బ్లూ ఉన్న బిజినెస్‌ అకౌంట్‌కు అఫీషియల్‌ గోల్డెన్‌ కలర్‌ చెక్‌ మార్క్‌, ప్రభుత్వం, ప్రభుత్వానికి చెందినే ఒకే విభాగంలో ఒకటి అంతకు మించి అకౌంట్‌లు ఉంటే వాటికి గ్రే చెక్‌ మార్క్‌ వస్తుంది. ఇది సాధారణ వినియోగదారుల మధ్య తేడాను గుర్తించడంలో సహాయపడుతుంది.

అతి త్వరలో, ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రైబర్‌లు తక్కువ యాడ్స్‌  ఫీచర్లు పొందవచ్చు. అదే వెరిఫై చేయని యూజర్ల అకౌంట్ల మీద వీడియోలు, పెద్దమొత్తంలో యాడ్స్‌ ప్రసారం కానున్నాయి. దీంతో యూజర్లు ట్విట్‌ బ్లూను వినియోగించేందుకు మొగ్గుచూపుతారని మస్క్‌ భావిస్తున్నారు. 

చదవండి👉‘ఏ పూట ఉద్యోగం ఊడుతుందో’, మరోసారి గూగుల్‌,అమెజాన్‌ షాకింగ్‌ నిర్ణయం?

చదవండి👉‘ఇక నిద్ర పోండి’, ట్విటర్‌ ఆఫీస్‌లో ఎలాన్‌ మస్క్‌ సరికొత్త ప్రయోగం!

Videos

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)