amp pages | Sakshi

68 ఏళ్ల సర్వీస్​లో​.. ఒక్కరోజు లీవ్​ పెట్టలేదు మరి!

Published on Fri, 01/28/2022 - 14:50

నిబద్ధతతో, నిజాయితీతో పని చేసే ఉద్యోగులే ఒక కంపెనీకి నిజమైన సంపద!. ఇలాంటి డెడికేషన్​తోనే ఇక్కడో పెద్దాయన ఒకే కంపెనీలో దాదాపు ఏడు దశాబ్ధాలుగా పని చేశారు.. ఇంకా చేస్తూనే ఉన్నారు. రిటైర్​మెంట్​కు కంపెనీ అవకాశం ఇచ్చినా..  ఇంకా కొన్నేళ్లపాటు సర్వీస్​లోనే కొనసాగాలనుకుంటున్నారు. విశేషం ఏంటంటే.. ఇన్నేళ్లలో జబ్బు చేసిందని ఒక్క సిక్​ లీవ్​ కూడా పెట్టలేదు ఆయన. అందుకే కంపెనీ సైతం సర్వీస్​ను ఆయన ఇష్టమైనంత కాలం పొడిగించింది.  83 ఏళ్ల వయసులోనూ హుషారుగా పనిచేస్తున్న బ్రెయిన్​ క్రోలే గురించి ఆసక్తికర కథనం.. 

సౌత వెస్ట్​ ఇంగ్లండ్​ సోమర్​సెట్​లో నివాసం ఉండే బ్రియన్​​ కోర్లే.. 1953లో తన 15 ఏళ్ల వయసులో సీ అండ్​ జే క్లార్క్స్​ షూ ఫ్యాక్టరీలో పనికి కుదిరాడు. పేదరికం కారణంగా తండ్రి ఆర్మీలో చేరితో.. కుటుంబ పోషణలో భాగం కావాలని చిన్నవయసులో బ్రియన్​ ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఏజ్​ వల్ల మొదట కంపెనీ అతన్ని తీసుకునేందుకు ఒప్పుకోలేదు. చదువుకుంటూనే పనికి వస్తానని చెప్పడంతో అప్పుడు ఓకే చెప్పింది. అలా ఓవైపు స్కూల్​.. మరోవైపు ఫ్యాక్టరీ.. సమ్మర్​ హాలీడేస్​ పూర్తిస్థాయి పనికే అంకితం అయ్యాడు. వారంలో 45 గంటల పని.. వచ్చిన డబ్బంతా అమ్మకు ఇచ్చేసేవాడు. అలా ఏళ్లు గడిచినా.. క్లార్క్స్​ కంపెనీతో అతని బంధం కొనసాగుతూ వస్తోంది.


 
ఇంతలో కంపెనీ షూ మ్యానుఫ్యాక్చరింగ్​ ఆపేసి.. అవుట్​లెట్​ బిజినెస్​లోకి అడుగుపెట్టింది. ఆ సమయానికి బ్రియన్​ వయసు 50 ఏళ్లు. అన్నేళ్లపాటు కంపెనీలో కొనసాగినందుకు ప్రతిగా.. అతని అవుట్​లెట్​ విభాగానికి బదిలీ చేసింది. దీంతో బ్రియన్​ సేవలు కొనసాగుతూ వచ్చాయి. ప్రస్తుతం బ్రియన్​ వయసు 83 ఏళ్లు. కంపెనీ రికార్డుల్లో ఈయనగారు ఒక్క సిక్​ లీవ్​ కూడా పెట్టలేదని ఉంది. ఇంకో వందేళ్లైనా ఇదే కంపెనీలో పని చేస్తానంటూ హుషారుగా చెప్తున్నాడు ఈ తాత.
 
ఇంతకీ ఈ పెద్దాయన ఇన్​స్పిరేషన్​ ఎవరో తెలుసా? ప్రముఖ బ్రాడ్​కాస్టర్​ డేవిడ్​ ఫ్రెడెరిక్​ అట్టెన్​బర్గ్. 95 ఏళ్ల వయసులో హుషారుగా ఈ పెద్దాయన రిటైర్​మెంట్​ లేకుండా పని చేస్తున్నాడు. ఒకవైపు ప్రకృతి ప్రేమికుడిగా వైల్డ్​ లైఫ్​ ఫిల్మ్​మేకింగ్​తో, మరోవైపు బ్రాడ్​కాస్టింగ్​ ప్రొఫెషనలిజంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు అట్టెన్​బర్గ్​.  అందుకే సర్​ డేవిడ్​లా తాను సుదీర్ఘకాలం ఇష్టమైన పనిలో కొనసాగాలని నిర్ణయించుకున్నాడట!. పనిలో ఇష్టం.. నిజాయితీ.. దేవుడంటే నమ్మకం.. ఆరోగ్యవంతమైన జీవనం ఇదే తన కెరీర్​ రహస్యం అంటున్నారు బ్రియన్​​ కోర్లే.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)