amp pages | Sakshi

ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడులు వచ్చే స్కీమ్స్‌ ఇవే

Published on Mon, 09/20/2021 - 07:42

ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌తో పోలిస్తే అధిక భద్రతనిస్తూనే, పూర్తి హామీతో కూడిన రాబడులను ఇచ్చే సాధనాలు ఏవైనా ఉన్నాయా? – కవాన్‌జైన్‌ 
మీరు సీనియర్‌ సిటిజన్‌ అయితే (60 ఏళ్లు నిండినవారు) సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీమ్‌ (ఎస్‌సీఎస్‌ఎస్‌), ప్రధానమంత్రి వయవందన యోజన (పీఎంవీవీవై), పోస్ట్‌ ఆఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ (పీవో ఎంఐఎస్‌) పథకాలను పరిశీలించొచ్చు. ఇవన్నీ భద్రతతో కూడిన పెట్టుబడి సాధనాలు. వీటికి ప్రభుత్వ హామీ ఉంటుంది. వీటి తర్వాత షార్ట్‌ డ్యురేషన్‌ డెట్‌ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు.

ఇవి తక్కువ నాణ్యత (రేటెడ్‌) సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయవు. ఒకవేళ మీరు చిన్న వయసులో ఉండి, దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్‌ చేసుకోవాలని అనుకుంటుంటే.. కొంత మొత్తాన్ని ఈక్విటీకి కూడా కేటాయించుకోవాలి. రిస్క్‌ ఏ మాత్రం తీసుకోకపోతే చెప్పుకోతగ్గ రాబడులను పొందలేరు. రిస్క్‌ తీసుకోని ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల విలువ వృద్ధి చెందుతుందని అనుకుంటారు కానీ.. ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసి చూస్తే వాస్తవ విలువ తగ్గిపోతుంది. ద్రవ్యోల్బణ రేటు కంటే తక్కువగా మీ పెట్టుబడులు వద్ధి చెందుతుంటే కనుక.. చూడ్డానికి పెరిగినట్టు అనిపించినా వాటి విలువ తగ్గిపోయినట్టే. కనుక దీర్ఘకాలానికి పెట్టుబడుల్లో కొంత మేర రిస్క్‌ తీసుకోవచ్చు.

నా వయసు 50 ఏళ్లు. స్మాల్‌క్యాప్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంటాను. ప్రస్తుత పరిస్థితుల్లో స్మాల్‌క్యాప్‌నకు, ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సాధనాల మధ్య కేటాయింపులు ఎలా ఉండాలి?   – ఎస్‌కే శర్మ 
మీ వయసు ప్రకారం చూస్తే.. స్మాల్‌క్యాప్‌ విభాగంలో (మార్కెట్‌ విలువ పరంగా చిన్న కంపెనీలు) ఇన్వెస్ట్‌ చేయడం మంచిదే. గణనీయంగా విలువ పడిపోయినా ఫర్వాలేదనుకుంటే మీరు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అద్భుత రాబడులను ఇచ్చినా.. స్వల్పకాలంలో ఇవి ఎంతో నిరుత్సాహపరుస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో వీటిల్లో పతనం చాలా స్వల్పకాలంలోనే గణనీయంగా ఉంటుంది.

అయితే ప్రతీ ఇన్వెస్టర్‌ కూడా కనీసం 20–25 శాతం వరకు అయినా స్థిరాదాయ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. ఇందుకు ఎటువంటి సూత్రం అవసరం లేదు. ఇలా చేయడం వల్ల స్మాల్‌క్యాప్స్‌ నుంచి సంపాదించుకున్న మొత్తానికి కొంత రక్షణ కల్పించుకోవచ్చు. స్మాల్‌క్యాప్‌ పెట్టుబడులు గణనీయంగా పెరగొచ్చు లేదా పడిపోవచ్చు. దానికి తగినట్టు పెట్టుబడుల కేటాయింపులను మార్చుకోవాలి. ఉదాహరణకు స్మాల్‌క్యాప్‌లో 75 శాతం, ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సాధనాలకు 25 శాతంగా అస్సెట్‌అలోకేషన్‌ను నిర్ణయించుకున్నారనుకుంటే.. స్మాల్‌క్యాప్‌ పెట్టుబడుల విలువ మొత్తం పెట్టుబడుల్లో 90 శాతానికి చేరితే.. అప్పుడు తిరిగి 75 శాతానికి తగ్గించుకోవాలి. అంటే ఆ మేరకు స్మాల్‌క్యాప్‌ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుని డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి.

ఒకవేళ స్మాల్‌క్యాప్‌ పెట్టుబడులు 75 శాతం కంటే తగ్గిపోయి, డెట్‌ సాధనాల విలువ పెరిగిన సందర్భాల్లో.. డెట్‌ పెట్టుబడులను 25 శాతానికి తగ్గించుకుని, మిగిలిన మేర స్మాల్‌క్యాప్‌లో పెట్టుబడులు పెంచుకోవాలి. డెట్‌ సాధనాలకు కనీసం 20–25 శాతం అయినా కేటాయించుకుంటేనే అర్థవంతంగా ఉంటుంది. ఇంతకంటే తక్కువ కేటాయింపులు చేసుకుని.. పోర్ట్‌ఫోలియోలను మార్చుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం నెరవేరదు.

చదవండి:  డీమ్యాట్‌ అకౌంట్ల స్పీడ్‌, స్టాక్‌ మార్కెట్లో పెరుగుతున్న పెట్టుబడులు

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)