amp pages | Sakshi

ఫేస్‌బుక్ మాతృ సంస్థ పేరు మార్పు వెనుక అసలు కారణం ఇది?

Published on Fri, 10/29/2021 - 17:55

ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ "ఫేస్‌బుక్, మెసెంజర్, ఇనస్టాగ్రామ్, వాట్సాప్" మాతృ సంస్థ పేరును ఫేస్‌బుక్ నుంచి మెటాగా మార్చిన సంగతి మనకు తెలిసిందే. ఇక పై నుంచి ఈ యాప్స్ మాతృ సంస్థను మెటాగా వ్యవహరించాల్సి ఉంటుంది అని జుకర్‌బర్గ్‌ కంపెనీ కనెక్ట్‌ ఈవెంట్‌లో ప్రకటించారు. ఈ మేరకు జుకర్‌బర్గ్‌ కనెక్ట్‌ ఈవెంట్‌లో తన కంపెనీ కొత్త పేరు, లోగోను ప్రకటించారు. నిజానికి చెప్పాలంటే పూర్తి పేరు మెటావర్స్. దీనిని సంక్షిప్తంగా మెటా అని నామకరణం చేశారు. గ్రీకు భాషలో 'మెటా' అంటే "అంతకు మించి" అని అర్ధం.

అయితే, ఫేస్‌బుక్ పేరు మార్పు విషయంలో చాలా మంది తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు. ఇక నుంచి ఫేస్‌బుక్ పేరు మెటాగా మారనున్నట్లు అర్ధం చేసుకుంటున్నారు. కానీ, అది వాస్తవం కాదు. ఇప్పటి వరకు "ఫేస్‌బుక్, మెసెంజర్, ఇనస్టాగ్రామ్, వాట్సాప్" అన్నీ యాప్స్ కి కలిపి మాతృ సంస్థగా ఫేస్‌బుక్ కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు ఆ మాతృ సంస్థ పేరును "మెటా"గా జుకర్‌బర్గ్‌ ప్రకటించారు. అంటే ఇకపై మెటా మాతృ సంస్థ కింద ఫేస్‌బుక్, మెసెంజర్, ఇనస్టాగ్రామ్, వాట్సాప్ యాప్స్ ఉంటాయన్నమాట. అయితే ఉన్నఫలంగా ఇప్పటికిప్పుడు ఈ మార్పు ఎందుకు?.

(చదవండి: టాటా మోటార్స్ అస్సలు తగ్గట్లేదుగా!)

అసలు కారణం ఇది
అక్టోబర్ 28న జరిగిన కంపెనీ కనెక్ట్‌ ఈవెంట్‌లో సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ పేరు మార్పు గురుంచి ఇలా మాట్లాడారు.. "భవిష్యత్తులో మన సంస్థ ఏం చేయబోతోందనే విషయాన్ని ఫేస్‌బుక్ అనే పదంతో నిర్వచించలేం. మన విస్తరణకు ఆ పదం చాలా చిన్నదైపోయింది. కొత్త పేరు ఫేస్‌బుక్ యాప్స్ అన్నింటినీ రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పటి వరకు ప్రజలకు చేరువకావడానికి అన్నీ సంస్థలు యాప్స్ ను మాత్రమే వాడుకొనేవి, భౌతికంగా దగ్గర అయ్యే విధంగా అనుభూతి కలిగించే టెక్నాలజీ లేదు. అలాంటి లోటు పూడ్చడానికి రాబోయే రోజుల్లో సంస్థ భారీ ఎత్తున చేపట్టబోయే ఆగ్యుమెంట్, వర్చువల్ రియాలటీకి ప్రతిబింబంగా ఈ మెటా నిలుస్తుంది. మనం ఎవరు, మనం భవిష్యత్తులో ఏం నిర్మించాలనుకుంటున్నాం అనేది మెటా మీనింగ్" అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ ఆధారిత సేవలకు చిరునామాగా మారాలనే లక్ష్యాన్ని మెటా నిర్దేశించుకుంది.
 

(చదవండి: దేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ ఫోన్‌ ఇదే..!)

మరో కారణం
సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ మాతృ సంస్థ పేరు మార్పు విషయం గురుంచి ఇలా చెబుతున్నప్పటికీ మరోవైపు టెక్ నిపుణులు మాత్రం ఈ పేరు మార్పు వెనక ఇతర కారణాలున్నాయని చెబుతున్నారు. గత కొంత కాలంగా ఫేస్‌బుక్ వివాదాలు ఎదుర్కొంటోంది. ఆ గొడవలు అటు ఇటు తిరిగి వాట్సాప్ కు కూడా వ్యాపించాయి. మరో వైపు ప్రైవసీ పాలసీ విషయంలో దుమారం రేగింది. దీంతో ఆసియా దేశాల్లో ఫేస్‌బుక్ పై ఓ రకమైన వ్యతిరేక భావన ఏర్పడింది. మరోవైపు యూరోపియన్ దేశాలు సంస్థ మీద భారీగా జరిమానా కూడా విధిస్తున్నాయి. వీటన్నింటి నుంచి యూజర్ల దృష్టి మారాల్చడానికి మాతృ సంస్థ పేరు మార్చేయడమే ఉత్తమమని జుకర్‌బర్గ్‌ భావించినట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. 

Videos

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)