amp pages | Sakshi

భారత జీడీపీ వృద్ధి: వరల్డ్‌ బ్యాంకు షాకింగ్‌ అంచనాలు

Published on Tue, 06/07/2022 - 21:15

సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో  భారతదేశ  జీడీపీ అంచనాలపై ప్రపంచ బ్యాంక్  కీలక అంచనాలను విడుదల చేసింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఊహించిన దానికంటేఎక్కువ కాలం కొనసాగుతున్న ఉక్రెయిన్‌-రష్యా వార్‌, సరఫరా గొలుసు అంతరాయాలు, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత రీత్యా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 2022-మార్చి 2023 వరకు)  భారత ఆర్థికవృద్ధి అంచనాను 7.5 శాతానికి తగ్గించింది. గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ తాజా సంచికలో ఈ అంచనాలను మంగళవారం  వెల్లడించింది. అంతేకాదు 2023-24లో వృద్ధి మరింత మందగించి 7.1 శాతానికి చేరుకుంటుందని కూడా  పేర్కొంది.

ఇండియా జీడీపీ వృద్ధి అంచనాను సవరించడం ఇది రెండోసారి. ఏప్రిల్‌లో 8.7 శాతం నుండి 8 శాతానికి తగ్గించింది. ఇపుడు  7.5 శాతానికి అంచనా వేసింది. ఇది మునుపటి (2021-22) ఆర్థిక సంవత్సరంలో 8.7 శాతంగా ఉంచింది. అలాగే వ్యాపార వాతావరణాన్ని మెరుగు పర్చేందుకు ప్రోత్సాహకాలు, సంస్కరణలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ప్రైవేట్ రంగ స్థిర పెట్టుబడుల ద్వారా కూడా వృద్ధికి తోడ్పడాలని   పేర్కొంది.  

కాగా గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు కూడా భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాను తగ్గించిన సంగతి తెలిసిందే. గత నెలలో, మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అధిక ద్రవ్యోల్బణాన్ని పేర్కొంటూ 2022 క్యాలెండర్ సంవత్సరానికి జీడీపీ ప్రొజెక్షన్‌ను 9.1 శాతం నుండి 8.8 శాతానికి తగ్గించింది. ఇంధనం మొదలు కూరగాయలు, వంట నూనె తదితర అన్ని వస్తువుల ధరల పెరుగుదల ఏప్రిల్‌లో  టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం రికార్డు గరిష్ట స్థాయి 15.08 శాతానికి,  రిటైల్ ద్రవ్యోల్బణం దాదాపు ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతానికి చేరుకుంది.

మరోవైపు గత నెలలో బెంచ్‌మార్క్ వడ్డీ రేటును 4.40 శాతానికి పెంచిన ఆర్‌బీఐ రానున్న మానిటరీ పాలసీ రివ్యూలో మరోసారి వడ్డీ  రేట్లను పెంచనుందనే అంచనాలు మార్కెట్‌ వర్గాల్లో నెలకొన్నాయి. 

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)