amp pages | Sakshi

ప్రాక్టికల్స్‌ పేరుతో.. 17 మంది బాలికలపై ప్రిన్సిపల్‌ అత్యాచారం

Published on Tue, 12/07/2021 - 15:36

లక్నో: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు కామాంధుడిగా మారాడు. విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించాల్సిన గురువు బాధ్యతను మరిచి పైశాచికంగా ప్రవర్తించాడు. పరీక్షల పేరుతో పాఠశాలకు పిలిచి విద్యార్థినులపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఓ కీచకుడు. గౌరవప్రదమైన ప్రధానోపాధ్యాయ వృత్తిలో ఉండి ఆ పదవికే మాయని మచ్చగా తయారయ్యాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 మంది విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘోర ఘటన ఉత్తర ప్రదేశ్‌లో నవంబర్‌ 17న చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగు చూసింది.
చదవండి: పోలీసుల అదుపులో 44 మంది మహిళలు.. కువైట్‌ వెళ్తుండగా..

ముజఫర్‌నగర్‌లోని పుర్కాజి ‍ప్రాంతంలో ఓ ప్రైవేట్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ పరీక్షల సాకుతో పదో తరగతి చదువుతున్న 17 మంది బాలికలను పాఠశాలకు పిలిపించాడు. మరునాడు సీబీఎస్‌ఈ ప్రాక్టికల్‌ పరీక్షలు ఉన్నాయని రాత్రంతా అక్కడే ఉండాలని సూచించాడు. విద్యార్థుల కోసం భోజనం తయారు చేసి.. అందులో మత్తు మందు కలిపిన ఆహారాన్ని విద్యార్థినులకు అందించాడు. తరువాత విద్యా‍ర్థులు స్పృహ కోల్పోవడంతో ప్రధానోపాద్యాయుడితోపాటు అతని సహచరుడు బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం గురించి ఎవరికీ చెప్పవద్దని, చెబితే పరీక్షల్లో ఫెయిల్‌ చేస్తామని, వారి కుటుంబ సభ్యులను చంపేస్తామని బాలికలను బెదిరించారు.
చదవండి: Banjarahills: మహిళ స్నానం చేస్తుండగా వీడియో.. కేబుల్‌ టెక్నిషియన్‌ నిర్వాకం

బాలికలు మరుసటి రోజు పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చారు. అయితే బాధిత బాలికలు పేద కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. వీరిలో ఇద్దరు బాధితులు మాత్రం ధైర్యం చేసి జరిగిన దారుణం గురించి వారి తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో  తమ పిల్లలకు జరిగిన అన్యాయంపై కేసు నమోదు చేయాలని అనేకసార్లు కోరినప్పటికీ.. పోలీసులు పట్టించుకోలేదు. దీంతో తల్లిదండ్రులు పుర్కాజి ఎమ్మెల్యే ప్రమోద్‌ ఉత్వాల్‌ను ఆశ్రయించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
చదవండి: టిఫిన్‌ సెంటర్‌ నడుపుతూ జీవనం.. ప్రయోజకురాలవుతుందనుకుంటే..

ఈ ఘటనపై వెంటనే విచారణ జరపాలని ఎస్పీ అభిషేక్‌ యాదవ్‌ను ఎమ్మెల్యే కోరారు. ప్రస్తుతం ఇద్దరు వ్యక్తలు ప్రధానోపాధ్యాయుడితోపాటు అతని సహచరుడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదవ్వగా ఒకరిని అరెస్టు చేశారు. అంతేగాక ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పుర్కాజి స్టేషన్ హౌస్ ఆఫీసర్ వినోద్ కుమార్ సింగ్‌ను సస్పెండ్‌ చేసినట్లు ఎస్పీ  తెలిపారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)