amp pages | Sakshi

ఫేక్‌ లోన్‌ యాప్‌లతో జాగ్రత్త!

Published on Sun, 10/01/2023 - 03:28

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని వేధింపులకు, ఆర్థిక మోసాలకు పాల్పడే ఫేక్‌ లోన్‌యాప్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సైబర్‌ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నా­రు. కొన్ని ఆన్‌లైన్‌ రుణ యాప్‌లు ప్రముఖ కంపెనీల పేర్లను సైతం వాడుకొని ఆన్‌లైన్‌లో ప్రకటన­లు ఇస్తున్నా­యని వారు పేర్కొన్నారు. రూపీ ప్రో అనే ఆన్‌లైన్‌ రుణ యాప్‌ బజాజ్‌ ఫైనాన్స్‌ పేరును వినియోగించినట్లు కేంద్ర హోంశాఖ ఇప్పటికే గుర్తించింది.

ఫేక్‌ యాప్‌ల వివరాలను ఎక్స్‌ (ట్విట్టర్‌) ద్వారా వెల్లడిస్తోంది. చైనా సహా శత్రుదేశాల నుంచి కొన్ని సంస్థలు ఆన్‌లైన్‌ రుణ యాప్‌లను నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. వాటి సర్వర్లు ఆయా దేశాల్లో ఉంటున్నందున బాధితులు మోసపోయినప్పుడు కేసుల దర్యాప్తు సైతం కష్టసాధ్యమని వారు పేర్కొంటున్నారు. ఆన్‌లైన్‌లో రుణం తీసుకొనే ముందు యాప్‌ల వివరాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచిస్తున్నారు. 

ఫేక్‌ రుణ యాప్‌ల బారిన పడకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరి... 
♦ వెరిఫై చేయని ఆన్‌లైన్‌ రుణ యాప్‌లనుప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవద్దు.  
 ఆర్బీఐ రిజిస్టర్డ్‌ బ్యాంకులు లేదా నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలతో అఫిలియేషన్‌ లేకపోయినా అది మోసపూరిత ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌గా గుర్తించాలి. 
♦ తక్కువ మంది యూజర్లు, ప్రతికూల రేటింగ్స్‌ ఉన్న యాప్‌ల జోలికి వెళ్లవద్దు. 
♦  రుణం ఇచ్చేందుకు నిబంధనలేమీ లేకుండా వెంటనే సొమ్ము ఖాతాలో జమ చేస్తామని పేర్కొనే యాప్‌లు నకిలీవేనని తెలుసుకోవాలి.  
♦ బ్యాక్‌గ్రౌండ్‌ వెరిఫికేషన్‌ లేకుండా, ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండానే లోన్‌ ఇస్తామంటే అనుమానించాలి.  

కేంద్ర హోంశాఖ గుర్తించిన నకిలీ రుణ యాప్‌లు -  ఐవొరి లెండ్స్, క్యాష్‌ పార్క్, ఆన్‌లైన్‌ రూపీ ప్రో, మొబాబా కాయిన్స్, ఫిన్‌కాష్, లోన్‌బడ్డీ. 

Videos

సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు

సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..

చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త

చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు

చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"

రాజంపేట లో అశేష ప్రజా స్పందన

కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు

గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు

సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు