కొడుకు పేరిట కొరియర్‌‌: తండ్రికి షాక్‌!

Published on Sat, 08/29/2020 - 18:44

బెంగళూరు : కుమారుడి పేరిట వచ్చిన కొరియర్‌ బాక్స్‌లో ఉన్నది గంజాయని తెలిసి షాక్‌ తిన్నాడో తండ్రి. పిల్లాడి జీవితం పాడవకూడదన్న ఆలోచనతో పోలీసులను ఆశ్రయించి, గంజాయి పంపిన వ్యక్తిని కటకటాల వెనక్కు నెట్టించాడు. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరు, సదాశివనగర్‌కు చెందిన ఓ 45 ఏళ్ల వ్యాపారవేత్తకు 9వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నాడు. కొద్దిరోజుల క్రితం అతడు స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో పిల్లాడి పేరిట ఓ కొరియర్‌ వచ్చింది. దాన్ని అతడి తండ్రి తీసుకుని తెరిచి చూశాడు. దాంట్లో గోధుమ రంగులో ఉన్న పొడి కనిపించింది. అనుమానం వచ్చిన ఆ వ్యాపార వేత్త వెంటనే స్నేహితుడికి ఫోన్‌ చేశాడు. అనంతరం సదరు స్నేహితుడికి ఆ పొడిని ఫొటో తీసి వాట్సాప్‌లో పంపాడు. ( కన్నింగ్‌ కపుల్‌: పూజారులే టార్గెట్‌ )

ఆ వ్యక్తి దాన్ని గంజాయి పొడిగా గుర్తించాడు. దీంతో ఆందోళనకు గురైన వ్యాపారవేత్త వెంటనే సదాశివనగర్‌ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఆ పార్శిల్‌ ఎమ్‌జీ రోడ్‌నుంచి వచ్చిందని గుర్తించారు. ఆ వ్యాపార వేత్త కొరియర్‌ ఆఫీసుకు వెళ్లి కొరియర్‌ పంపిన వ్యక్తి వివరాలు అడగగా వారు నిరాకరించారు. దీంతో ఈ నెల 21న అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, పార్శిల్‌ పంపిన ధీరజ్‌ కుమార్‌ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. నిందితుడి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

Videos

భార్యను కిరాతకంగా.. అతడిని ఎన్కౌంటర్ చేయాలి

భారీగా వీడియోలు కొన్న నారా లోకేష్..

బెంగళూరు రేవ్ పార్టీ..టీడీపీ లీలలు..లోకేష్ అనుచరులు అరెస్ట్..

ఓటమి భయంతోనే చంద్రబాబు ...కూటమిని ఏకిపారేసిన బొత్స

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..

అర్ధరాత్రి దాకా విచారణ.. తెలంగాణ హైకోర్టులో అరుదైన ఘట్టం

టచ్ కూడ చెయ్యలేరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు చైతన్య కృష్ణ మాస్ వార్నింగ్

కాసుల కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్న డాక్టర్లు

జగన్ విజయం ఖాయమంటున్న సర్వేలు..

టీడీపీ గూండాల విధ్వంసం.. వీడియోలు వైరల్

Photos

+5

Anasuya Sengupta: 'కేన్స్‌'లో చరిత్ర సృష్టించిన భారతీయ నటి (ఫోటోలు)

+5

నేను బతికే ఉన్నా.. ఫోటోలతో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌ (ఫొటోలు)

+5

హార్దిక్‌ పాండ్యాతో విడాకులంటూ వదంతులు.. ట్రెండింగ్‌లో నటాషా(ఫొటోలు)

+5

Kavya Maran: అవధుల్లేని ఆనందం.. యెస్‌.. ఫైనల్లో సన్‌రైజర్స్‌ (ఫొటోలు)

+5

సీరియల్‌ నటి ఇంట సంబరాలు.. మళ్లీ మహాలక్ష్మి పుట్టింది! (ఫోటోలు)

+5

సచిన్ టెండూల్కర్‌‌‌‌‌‌‌‌ని కలిసిన బాక్సింగ్ క్వీన్‌‌‌‌ (ఫొటోలు)

+5

సాగని సంసారం.. రొమ్ము క్యాన్సర్‌తో పోరాటం.. తెలుగులో ఒకే ఒక్క మూవీ (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో ట్రిప్‌.. పొట్టి డ్రెస్‌లో అనసూయ జలకాలాటలు (ఫోటోలు)

+5

రేవ్‌ పార్టీ.. హేమతో పాటు ఈ బ్యూటీ కూడా.. ఇంతకీ ఎవరంటే? (ఫోటోలు)

+5

Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (23-05-2024)