amp pages | Sakshi

నకిలీ బంగారంతో రూ 2.71 కోట్లకు టోకరా 

Published on Tue, 11/28/2023 - 05:04

గుంటూరు రూరల్‌: గుంటూరు నగర శివారులోని ఒక బ్యాంకు బ్రాంచిలో భారీ మోసం బయటపడింది. కొందరు వ్యక్తులు నకిలీ బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొందినట్టు వెల్లడైంది. ఇందులో బ్యాంకు అప్రైజర్‌ ప్రమేయం కూడా ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ వ్యవహారం బయటపడకుండా కొందరు అధికారులు నిజమైన బంగారం తాకట్టు పెట్టిన వారికి వారు వడ్డీతో కలిపి చెల్లించాల్సిన మొత్తం కంటే ఎక్కువ కట్టాలని నోటీసులు పంపడం, ఆడిట్‌లో అసలు విషయాలు వెలుగుచూడటంతో మొత్తం గుట్టంతా రట్టయింది. మొత్తం 107 మంది నకిలీ బంగారంతో రుణాలు పొందినట్లు వెల్లడైంది.

నిజమైన బంగారంతో రుణాలు పొందిన ఖాతాదారులు బ్యాంకుకు వచ్చి ఎక్కువ మొత్తానికి ఎందుకు నోటీసులు ఇచ్చారని ప్రశి్నంచినందుకు వారిని కూడా ఇబ్బంది పెట్టినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంపై ఆడిట్‌ ధికారులు, బ్యాంక్‌ అధికారులు గుంటూ­రు నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవా­రం నల్లపాడు సీఐ రాంబాబు వెల్లడించిన వివరాల ప్రకా­రం.. గుంటూరు – అమరావతి రోడ్డు గోరంట్ల గ్రామంలో­ని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచిలో ఆడిట్‌ నిర్వహిస్తుండగా వెండి వస్తువులకు బంగారు పూత పూసి  బంగారు వస్తువులుగా చూపి పలువురు కోట్ల రూపాయలు రుణాలు పొందారని బ్యాంక్‌ ఇంటర్నల్‌ అధికారి అనిల్‌ డెకాబె, బ్యాంక్‌ రీజినల్‌ మేనేజర్‌ ధనరాజ్‌ ఫిర్యాదు చేశా­రు.

2021 జనవరి 29 నుంచి 2023 నవంబరు 16 వరకు ఆడిట్‌ నిర్వహించగా 107 ఖాతాలలో నకిలీ బంగారంతో రుణాలు పొందినట్లు గుర్తించారు. వీటిలో దాదాపు 100 ఖాతాలలో నకిలీ బంగారం పెట్టి రుణం పొందే సమయంలో రీ అప్రైజల్‌ కూడా నిర్వహించలేదని గుర్తించారు. ఈ విధంగా నకిలీ బంగారంతో రూ.2.71 కోట్లు బ్యాంకుకు టోకరా వేసినట్లు తేలిందన్నారు. లోన్‌ అప్లికేషన్స్, అప్రైజల్‌ తదితర పరిశీలనలు చేయకుండా రుణా­లు ఇ చ్చి నట్లు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యా­ప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. నిజమైన బంగారంతో రుణాలు పొందిన  పలువురు ఖాతాదారులకు వారు తీసు­కు­న్న రుణం కంటే రెండు రెట్లకు నోటీసులు రావడంతో వా­రంతా కూడా పోలీసులను ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. 

Videos

విశాఖపై టీడీపీ కొత్తరాగం

పేదలపై చంద్రబాబు పెత్తందారీ కుట్ర

సముద్రంలో చేపలు పట్టిన KA పాల్

నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి లు చెప్పేవి అన్ని అబద్ధాలే..

బాచుపల్లిలో ఘోర ప్రమాదం

మేము ఎప్పుడో గెలిచాం..మెజారిటీ కోసం చూస్తున్నాం..

నల్లజర్ల ఘటనపై మంత్రి తానేటి వనిత రియాక్షన్

సర్వే పై సంచలన విషయాలు బయటపెట్టిన కెఎస్ ప్రసాద్..

బూతు అస్త్రం ప్రయోగిస్తున్న బాబు

టీడీపీ నేతకు బాలినేని స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?